Hormuz Amid Crisis: హోర్ముజ్ దాటాలంటే భారీ మొత్తం చెల్లించాల్సిందే.. ఒక చమురు ట్యాంకర్‌కు ఇరాన్ ఎంత వసూలు చేస్తుందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hormuz Amid Crisis: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు మార్గమైన హోర్ముజ్ జలసంధిపై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్లపై ఇరాన్ భారీ రుసుములు వసూలు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం, ఒక చమురు ట్యాంకర్ సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటడానికి సుమారు 2 మిలియన్ డాలర్లు (దాదాపు ₹18 కోట్లకు పైగా) చెల్లించాల్సి వస్తోంది. ఇది ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారింది.
సంక్షోభానికి కారణాలు:
ఇరాజ్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ పరిస్థితికి దారితీశాయి. యుద్ధ వాతావరణం కారణంగా హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటం వల్ల, ఈ మార్గంలో ఏర్పడిన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
భారీ రుసుముల వసూలు:
లండన్‌కు చెందిన “ఇరాన్ ఇంటర్నేషనల్” నివేదిక ప్రకారం, ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు అలయెద్దీన్ బరూజెర్దీ ఈ రుసుముల వసూలును సమర్థించారు. “యుద్ధానికి మూల్యం చెల్లించాల్సిందే.. అందుకే ఈ రుసుములు అవసరం” అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
అంతర్జాతీయ ప్రభావం:
చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి.. పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. షిప్పింగ్ కంపెనీలకు అదనపు ఆర్థిక భారం పడుతోంది.. పాకిస్థాన్, శ్రీలంక, యూకే వంటి దేశాలు ఇప్పటికే ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. అయితే ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. హోర్ముజ్ మార్గాన్ని పూర్తిగా తెరవాలని కోరుతూ, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ నాయకత్వం కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడులు జరిగితే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!