NTV Telugu Site icon

Iran: హెజ్‌బొల్లా చీఫ్ హత్య.. ఇరాన్‌ భద్రతా మండలి అత్యవసర భేటీ..

Iran

Iran

Iran: ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ హసన్‌ నస్రల్లా మరణించడంతో గట్టి షాక్ తగిలింది. దీంతో హెజ్‌బొల్లా మరింత తీవ్రంగా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇరాన్‌ భద్రతా మండలి అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది. హెజ్ బొల్లాకు మద్దతిస్తున్నట్లు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. దీనిపై భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే ఇజ్రాయెల్‌పై యెమెన్, లెబనాన్, సిరియా తీవ్రంగా విరుచుకుపడే ఛాన్స్ ఉంది. ఈ దాడులకు ఇరాన్‌ సపోర్టుగా నిలుస్తుందని టాక్.

Read Also: Mallu Bhatti Vikramarka: లేక్స్ లేకపోతే విజయవాడ పరిస్థితే హైదరాబాద్ కు..

కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. లెబనాన్‌ ప్రజలకు, హెజ్‌బొల్లాకు మద్దతుగా ఉండటంతో పాటు ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోవడంలో వారికి సహాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గాజాలో ఏడాదిగా కొనసాగుతున్న యుద్ధం నుంచి ఇజ్రాయెల్‌ ఏం నేర్చుకోలేదన్నారు. మహిళలు, పిల్లలు, పౌరుల సామూహిక హత్యలు ఆ ప్రతిఘటన శక్తుల్ని విచ్ఛిన్నం చేయలేవన్నారు. నస్రల్లా హత్య తర్వాత ఖమేనీని ఇరాన్‌లోని సురక్షిత ప్రదేశానికి అక్కడి ఆర్మీ తరలించింది. నస్రల్లా హత్యను ఖండిస్తూ.. ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతూ టెహ్రాన్‌లో వేలాది మంది ఇరానియన్లు వీధుల్లోకి వచ్చి ఆందోళన తెలిపారు.

Read Also: Harish Rao: మూసి ప్రాంతంలో కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలి..

అయితే, హసన్ నస్రల్లా హత్యను ఇజ్రాయెల్ ధృవీకరించిన తర్వాత సిరియాలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సిరియా విప్లవాన్ని అణచివేసేందుకు అప్పటి హెజ్‌బొల్లా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌కు మిలిటెంట్ గ్రూప్ సహాయం చేసినందున అక్కడి ప్రజలు వారిని శత్రువులుగా భావిస్తారు. అంతర్యుద్ధం టైంలో వేలాది మంది సిరియన్లు హెజ్‌బొల్లా దాడుల్లో తమ ప్రాణాలను కోల్పోయారు. కాగా, శనివారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 33 మంది చనిపోగా, మరో 195 మంది తీవ్రంగా గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. గత రెండు వారాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 1,000 మందికి పైగా మృతి చెందాగా.. దాదాపు 6,000 మందికి పైగా గాయపడ్డారని చెప్పుకొచ్చారు. అలాగే, వందల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోయారని వెల్లడించారు.