Iran War: అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి..?
- అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి..? బహ్రైయిన్‌లో డ్రోన్ అటాక్‌తో సేవలకు అంతరాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ అన్నంత పని చేసింది. తమ గడ్డపై దాడులు చేస్తున్న అమెరికాకు, ధీటుగా బదులిస్తామని, ఏప్రిల్ 1 నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. నివేదికల ప్రకారం.. బహ్రైయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడికి పాల్పడింది. అయితే డేటా సెంటర్ ఇరాన్ మెయిన్ టార్గెట్ కానప్పటికీ, దాని సమీపంలో జరిగిన దాడి వల్ల డేటా సెంటర్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత భారీ స్థాయిలో సేవలు నిలిచివేతను నివారించేందుకు, తమ వర్క్‌లోడ్‌ను ఇతర ప్రాంతాలకు తరలించుకోవాలని అమెజాన్ తన క్లౌడ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది.
Read Also: Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
దీనికి ఒక రోజు ముందు.. ఏప్రిల్ 1 నుంచి అమెరికాకు చెందిన ప్రధాన టెక్నాలజీ, పారిశ్రామిక కంపెనీలపై అటాక్ చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్‌తో సహా 18 కంపెనీల పేర్లను పేర్కొంటూ వాటి ప్రాంతీయ కార్యకలాపాలపై దాడులు చేస్తామని ప్రకటించింది. అమెరికా దాని మిత్రదేశాల సైనిక చర్యలకు టెక్నాలజీ, ఏఐ, డేటా సపోర్టు అందిస్తున్నవి ఈ కంపెనీలే అని, అందుకే వీటిని లక్ష్యంగా చేసుకుంటామని చెప్పింది. ఈ సంస్థల్లో పనిచేస్తున్నవారు వెంటనే కార్యాలయాలు విడిచిపోవాలని, భద్రతా కారణాల వల్ల ఈ హెచ్చరిక ఇచ్చినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!