Earthquake: ఇండోనేషియాలో మరోసారి శక్తివంతమైన భూకంపం.. ప్రజలు హడల్
- ఇండోనేషియాలో మరోసారి శక్తివంతమైన భూకంపం
- 6.8 తీవ్రతతో భారీ భూకంపం
- బెంబేలెత్తిపోయిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. తాజాగా ఉత్తర సుమత్రా ప్రాంతంలో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం.. భూకంపం 158 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

Also Read
- Ind-Pak: పాక్‌కు భారత్ నెం.1 శత్రువు కాగా.. తర్వాత ఈ దేశాలే.. అసిమ్ మునీర్ వైఖరిపై సంచలన సర్వే
- US-Iran: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తామన్న ట్రంప్.. హార్ముజ్‌లో దాడులు తీవ్రం చేసిన టెహ్రాన్
- Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్‌స్టాండ్ పుష్అప్స్.. మహిళ గిన్నిస్ రికార్డు..
- Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఈ తాజా భూకంపానికి కొన్ని గంటల ముందు ఇండోనేషియా తీరానికి సమీపంలో 7.7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆగస్టు 15న తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం కారణంగా కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలు భవనాలు దెబ్బతిన్నాయి. 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత ప్రాంతంలో అనేక ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో అధికారులు కొంతకాలం సునామీ హెచ్చరిక జారీ చేశారు. అయితే పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఆ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
భూకంప ప్రకంపనలు ఇండోనేషియాలోని పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ఆసుపత్రులను ఖాళీ చేయించినట్లు సమాచారం. అధికారులు భూకంపం కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. తాజాగా ఉత్తర సుమత్రాలో 6.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Earthquake: ఇండోనేషియాలో మరోసారి శక్తివంతమైన భూకంపం.. ప్రజలు హడల్
-
Fauzi: మంటల్లో చార్మినార్.. గాంధీని కాదని, రక్తం చిందిస్తున్న ప్రభాస్!
-
Ind-Pak: పాక్‌కు భారత్ నెం.1 శత్రువు కాగా.. తర్వాత ఈ దేశాలే.. అసిమ్ మునీర్ వైఖరిపై సంచలన సర్వే
-
CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్‌కు సవాల్.!
-
Student Protest: జంతర్ మంతర్‌కు సాహో.. జార్ఖండ్ ఉద్యమానికి నో నో! CJP, బాలీవుడ్, కాంగ్రెస్ స్పందన ఎక్కడ?
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!