Site icon NTV Telugu

US: అమెరికాలో భారతీయ మహిళ హత్య.. ఎవరు చంపారంటే..!

Usindia

Usindia

అమెరికాలో భారతీయ యువతి నిఖితా గోడిశాల (27) దారుణ హత్యకు గురైంది. మేరీల్యాండ్‌లోని మాజీ ప్రియుడి అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా పడి ఉంది. నూతన సంవత్సర వేడుకల తర్వాత మహిళ కత్తిపోట్లకు గురై చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rajasthan Royals Captain: రాజస్థాన్ రాయల్స్‌లో కెప్టెన్సీ హీట్‌.. ఆర్ఆర్ పోస్ట్ వైరల్!

బాధితురాలు నిఖితా గోడిశాల ఎల్లికాట్ సిటీలో నివాసం ఉంటుంది. ఆమె స్ట్రాటజీ అనలిస్ట్ నిఖితా గోడిశాలగా గుర్తించినట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (26) ఇంట్లో నిఖితా హత్యకు గురైందని పేర్కొన్నారు. న్యూఇయర్ వేడుకల తర్వాత హత్య జరిగిందని.. అర్జున్ శర్మ భారతదేశానికి పారిపోయాడని వెల్లడించారు. హత్య అభియోగం మోపుతో దర్యాప్తు అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Latest Weather Update: చలి తీవ్రత తగ్గుముఖం పట్టినా పొంచి ఉన్న సంక్రాంతి ముప్పు

దర్యాప్తు సంస్థల ప్రకారం.. అర్జున్ శర్మనే నిఖితా గోడిశాల సమాచారాన్ని పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది. ఆమె కనిపించడం లేదని.. డిసెంబర్ 31న చివరి సారిగా తాను అపార్ట్‌మెంట్‌లో చూశానని.. జనవరి 2న అర్జున్ శర్మ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు అర్జున్ ఇంట్లో నిఖితా మృతదేహాన్ని కనుగొన్నారు. డిసెంబర్ 31 రాత్రి 7 గంటల తర్వాత నిఖితాను అర్జున్ హత్య చేసి భారతదేశానికి పారిపోయి ఉంటాడని డిటెక్టివ్‌లు విశ్వసిస్తున్నారు.

నిఖితా గోడిశాల హత్యపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అన్ని విధాలా సాధ్యమైన సహాయాన్ని అందిస్తోందని వెల్లడించింది. అంతేకాకుండా స్థానిక అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.

Exit mobile version