Sudiksha Missing: సుదీక్ష మిస్సింగ్‌లో కీలక ట్విస్! బార్లో ఎవరితో ఉందంటే..!
- సుదీక్ష మిస్సింగ్‌లో కీలక ట్విస్!
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సంతతి విద్యార్థిని కోనంకి సుదీక్ష చౌదరి (20) మిస్సింగ్ మిస్టరీగా మారింది. అమెరికాలోని వర్జీనియా నివాసి అయిన సుదీక్ష.. పిట్స్బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లింది. మార్చి 6న బీచ్‌లో విహరిస్తుండగా ఆకస్మాత్తుగా మాయం అయింది. అయితే ఈ విషయాన్ని స్నేహితులు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్లు, పడవలతో జల్లెడ పట్టారు. కానీ నేటికి ఆమె అడ్రస్ దొరకలేదు. దీంతో రియు రిపబ్లికా రిసార్ట్‌లో ఉన్న వీడియోలను పరిశీలించగా.. ఆమె రిసార్ట్ నుంచి ఒక యువకుడు జాషువా రీబేతో బయటకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అతడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని చెప్పుకొచ్చాడు. బీచ్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని.. అయితే ఒక అల రావడంతో పడిపోయామని.. తాను బయటకు వచ్చేశాను.. ఆమె కూడా వచ్చేసిందని పేర్కొ్న్నాడు. అనంతరం ఆమె నీళ్లు మింగడంతో వాంతు చేసుకున్నట్లు జాషువా రీబే చెప్పాడు. అనంతరం బీచ్ ఒడ్డున నిద్రపోయినట్లు తెలిపాడు. అనంతరం ఆమె ఏమైందో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. దీంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేయకుండా అబ్జర్వేషన్లో ఉంచారు.

Also Read
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
తాజాగా అధికారులు మరిన్ని వీడియోలను పరిశీలించారు. బార్లో ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్నేహితులతో కలిసి ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. ఒక వీడియోలో జాషువా రీబేతో కాకుండా మరొక సీనియర్ విద్యార్థితో కలిసి మద్యం సేవించినట్లుగా కనిపించింది. అంతేకాకుండా అతడితో చాలా సేపు ముచ్చట్లు పెట్టింది. అంతేకాకుండా అతడికి మద్యం అందించినట్లుగా కనిపిస్తోంది. అనంతరం ఇద్దరూ మద్యం సేవిస్తూ.. ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం జాషువా రీబే పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతడి పాస్‌పోర్టు జప్తు చేశారు. అయితే విచారణకు సహకరిస్తానని పేర్కొన్నాడు.
ఇక సుదీక్ష అమెరికా పౌరురాలి కాబట్టి.. అమెరికా అధికారులు.. డొమినికన్ రిపబ్లిక్ అధికారులతో కలిసి సెర్చ్ చేస్తున్నారు. అయితే స్థానిక అధికారులు మాత్రం ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని తేల్చేశారు. కానీ అందుకు సుదీక్ష తల్లిదండ్రులు మాత్రం అంగీకరించడం లేదు. కచ్చితంగా తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఒక వేళ బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటే.. కచ్చితంగా శవమైన కొట్టుకు వచ్చేదని తెలిపారు. ప్రస్తుతం అధికారులు మరిన్ని కోణాల్లో దర్యా్ప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా మార్చి 5 రాత్రి పుంటా కానాలోని రిసార్ట్ నైట్‌క్లబ్‌లో జరిగిన పార్టీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
-
Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!