Jammu Kashmir: ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్లుగా పాక్ కి ఎంత చెప్పిన తన వికృత చేష్టలు మాత్రం మానదు. తాజాగా మరోసారి భారత భూభాగం లోకి ప్రవేశించాలని చూసారు పాక్ ఉగ్రవాదులు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు మన సైనికులు. వివరాలలోకి వెళ్తే.. ఉత్తర కశ్మీర్ బారాముల్లా జిల్లా లోని ఉరి సెక్టార్‌లో ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించిందేకు ప్రయత్నించారు. కాగా ఉగ్రవాదుల ప్రయత్నాలను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. అక్రమంగా భరత్ భూభాగం లోకి ప్రవేశించాలని చూసిన ఉగ్రవాదుల్లో ఇద్దరినీ హతమార్చారు మన సైనికులు. కాగా మరో ఇద్దరు ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు ఆర్మీ అధికారులు. కాల్పుల అనంతరం ఘటన స్థలంలో సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా భారీ మొత్తంలో ఆయుధాలు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రత బలగాలు ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
కాగా ప్రతికూల వాతావరణం కారణంగా ఆపరేషన్‌ను నిలిపివేశారు. ఈ ఘటన గురించి రక్షణశాఖ అధికార ప్రతినిధి మాట్లాడారు. నియంత్రణ రేఖ మీదుగా భారీగా ఆయుధాలతో ఉగ్రవాదుల బృందం చొరబాటుకు ప్రయత్నిస్తున్నట్లుగా భద్రతా దళాలకు సమాచారం అందిందని.. దీంతో దళాలు యాంటీ ఇన్‌ఫిల్ట్రేషన్ గ్రిడ్‌ను పటిష్టం చేశారని పేర్కొన్నారు. ఎడతెరిపి లేని వర్షం, తక్కువ దృశ్యమానత ఉండడంతో సాయుధ ఉగ్రవాదులు నియంత్రణ రేఖగుండా చొరబాటుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ క్రమంలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయని. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని.. కాగా మిగిలిన ఉగ్రవాదులు వారి మృతదేహాలను తీసుకొని అక్కడి నుంచి తప్పించుకుపోయారని అధికారి ప్రతినిధి పేర్కొన్నారు. రాత్రంతా ఆ ప్రాంతంలో నిఘా వేసి ఉంచామని తెలిపారు. మరికొందరు ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడి ఉంటారని, సంఘటనా స్థలంలో ఆయుధాలన్నీ రక్తంతో తడిసిపోయాయని పేర్కొన్నారు.