Kash Patel: ఎఫ్‌బీఐ చీఫ్‌గా కాష్ పటేల్.. ప్రో-ఇండియా లీడర్లతో నింపేస్తున్న ట్రంప్..
- డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ఎంపిక..
- ఎఫ్‌బీఐ చీఫ్‌గా భారత మూలాలున్న కాష్ పటేల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kash Patel: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నియామకాన్ని ప్రకటించారు. భారత మూలాలు ఉన్న కాష్ పటేల్‌ని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించారు. కాష్ పటేల్ ట్రంప్‌కి సన్నిహిత మిత్రుడు, మాజీ జాతీయ భద్రతా సహాయకుడు. ప్రస్తుతం చీఫ్ క్రిస్టోఫర్ వ్రే స్థానంలో కాష్ పటేల్ ఎఫ్‌బీఐ చీఫ్ కానున్నారు. ‘‘పటేల్ ఒక తెలివైన న్యాయవాది, పరిశోధకుడు మరియు ‘అమెరికా ఫస్ట్’ పోరాట యోధుడు, అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని రక్షించడం మరియు అమెరికన్ ప్రజలను రక్షించడం కోసం తన కెరీర్‌ను గడిపాడు’’ అని ట్రంప్ ప్రశంసించారు.
44 ఏళ్ల కాష్ పటేల్ జాతీయ భద్రతా మండలిలో ట్రంప్‌కి ఉగ్రవాద నిరోధక సలహాదారుగా, తన చివరి పదవీ కాలంలో తాత్కాలిక రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు. డిఫెన్స్ అటార్నీగా, ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. కాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికా నుంచి కెనడాకు అక్కడ నుంచి యూఎస్ఏకి వలస వచ్చారు. గుజరాతీ భారతీయ దంపతులకు 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో కాష్ పటేల్ జన్మించారు. పటేల్ తండ్రి ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
Read Also: Mohan Bhagwat : ప్రతి ఒక్కరూ ముగ్గురు పిల్లలను కనాలి.. లేదంటే చాలా ప్రమాదం!
పేస్ యూనివర్సిటీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషణ్ పూర్తి చేసిన తర్వాత, పటేల్ ప్రతిష్టాత్మక లా సంస్థలో జాబ్ సంపాదించాలనుకుని విఫలమయ్యాడు. బదులుగా అతను పబ్లిక్ డిఫెండర్‌గా మారారు. న్యాయశాఖలో చేరడానికి ముందు మయామిలోని లోకల్ అండ్ ఫెడరరల్ కోర్టుల్లో 9 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత ట్రంప్ సన్నిహితుడైన రెప్.డెవిడ్ నూన్స్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ కమిటీలో సిబ్బందిగా నియమించబడ్డాడు.
కాష్ పటేల్ ‘‘న్యూన్స్ మోమో’’ అని పిలిచే రచయితకు సాయం చేశాడు. ఇది ట్రంప్ ప్రచార వాలంటీర్లపై నిఘా పెట్టడానికి వారెంట్ పొందడంలో యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ తప్పు చేసిందని వివరించినట్లు ఫస్ట్ పోస్ట్ నివేదించింది. మోమో విడుదలపై న్యాయ శాఖ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ పరిణామాలు కాష్ పటేల్ ట్రంప్ దృష్టిలో పడేలా చేశాయి. తర్వాత పటేల్ జాతీయ భద్రతా మండలిలో పనిచేయడానికి నియమించబడ్డాడు. ప్రస్తుతం ట్రంప్ గెలిస్తే, కాష్ పటేల్ కీలకమైన పొజీషన్లో ఉంటాడని తెలుస్తోంది.
ప్రస్తుతం ట్రంప్ కేబినెట్లో భారతీయ మద్దతుదారులుగా చెప్పబడుతున్న అమెరికన్లు అధికంగా ఉన్నారు. ట్రంప్ జాతీయ భద్రత సలహాదారుగా మైకెల్ వాల్ట్జ్, విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో, ఆ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తులసీ గబ్బార్డ్‌ని నియమించారు. వీరంతా కూడా భారత మద్దతుదారులుగా ఉన్నారు. తాజాగా కాష్ పటేల్ కూడా ప్రో-ఇండియా వ్యక్తిగా చెప్పబడుతున్నాడు.
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!