UN-India: హార్ముజ్‌ను దిగ్బంధించడం భావ్యం కాదు.. ఐరాసలో భారత్ ఖండన
- హార్ముజ్‌ను దిగ్బంధించడం భావ్యం కాదు
- భారత్ నావికులు కూడా ప్రాణాలు కోల్పోయారు
- ఐక్యరాజ్యసమితిలో భారత్ ఖండన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్ముజ్ జలసంధి దగ్గర వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఏ మాత్రం భావ్యం కాదని ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో హార్ముజ్‌పై భారతదేశం బలమైన సందేశం ఇచ్చింది. హార్ము్జ్ జలసంధిని దిగ్బంధించడాన్ని భారత్ ఖండించింది. వాణిజ్య నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
ఇది కూడా చదవండి: Iran-Trump: ‘గాలి మేడలు కట్టొద్దు’.. ట్రంప్ యురేనియం వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్
Also Read
- Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
- Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
‘‘వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, నిరపరాధ సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టడం, సముద్ర మార్గాల్లో స్వేచ్ఛగా వాణిజ్యాన్ని అడ్డుకోవడం అసహ్యం’’ అని భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా గౌరవించాలని కోరింది. హార్ముజ్ దగ్గర భారతీయ నావికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. హార్ముజ్‌లో సురక్షిత నౌకాయానాన్ని వెంటనే పునరుద్ధరించాలని భారత్ డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం కోసం యూకేలో జరిగిన 60కి పైగా దేశాల సమావేశంలో భారత్ కూడా పాల్గొంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు అవసరమని అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: MK Stalin on Delimitation Bill: కేంద్రంపై స్టాలిన్ ఫైర్.. మొండిగా ముందుకెళ్తే తమిళనాడు వీధుల్లో నిరసన జ్వాలలు..!
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దీంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుతం రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి.
#WATCH | Permanent Representative of India to the United Nations, Parvathaneni Harish, says, "Since the outbreak of the conflict in Iran and the Gulf region on 28 February 2026, India had expressed deep concern and urged all states to exercise restraint, avoid escalation and… pic.twitter.com/I4YvKcOnNX
— ANI (@ANI) April 17, 2026
తాజావార్తలు
-
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
-
Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్‌లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!