Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా 50 శాతం సుంకాలనున విధించింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం.
Read Also: Donald Trump: ‘‘తా చెడ్డ ట్రంప్’’.. ఇజ్రాయిల్, ఈయూని చెడగొట్టే ప్రయత్నం..
‘‘వారు ఇప్పుడు తమ సుంకాలను తగ్గించుకోవడానికి ముందుకొచ్చారు. కానీ ఆలస్యం జరిగింది. వారు సంవత్సరాల క్రితమే అలా చేసి ఉండాలి’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ‘‘ఏకపక్ష విపత్తు’’గా అభివర్ణించారు. చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సందర్భంగా ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
‘‘భారత్‌తో అమెరికా వ్యాపారం పూర్తిగా ఏకపక్ష విపత్తుగా మారింది, వారు మమ్మల్ని పెద్ద కస్టమర్లుగా చూస్తారు తమ ఉత్పత్తులను బల్క్‌గా అమ్ముకుంటారు, కానీ మేము వారికి అమ్మాలని చూస్తే వారి టారిఫ్‌లతో మమ్మల్ని నిలిపేస్తారు’’ అని ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ తమ చమురును, సైనిక ఉత్పత్తుల్ని రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తోందని, అమెరికా నుంచి తక్కువగా కొంటుందని ట్రంప్ తన తాజా పోస్ట్‌లో మరోసారి అన్నారు. అయితే, అమెరికా చేస్తున్న వాదనల్ని భారత్ తోసిపుచ్చింది. మార్కెట్ డైనమిక్స్ ఆధారంగా, దేశ ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటామని ఇండియా స్పష్టం చేసింది.
Trump
