Site icon NTV Telugu

Israel-Iran War: సంయమనం పాటించండి.. ఇరు దేశాలకు భారత్ సందేశం

Israel Iran War

Israel Iran War

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. ఇరాన్‌లో 100 లక్ష్యాలను ఇజ్రాయెల్ ఎంచుకుంది. ఒకేసారి 200 యుద్ధ విమానాలు ఎటాక్ చేశాయి. అంతే ఇరాన్ భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన టాప్ కమాండర్స్‌తో పాటు అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Honeymoon Murder: రాజా లాగే మరో మహిళను హత్య చేయాలని ప్లాన్.. సోనమ్ కేసులో సంచలన విషయం..

తాజాగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. 100 డ్రోన్లను ఇజ్రాయెల్‌ మీద ప్రయోగించింది. డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. ఇక పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై భారత్ స్పందించింది. ఇరు దేశాలతో మంచి సంబంధాలను భారత్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్.. ఇరు దేశాలకు కీలక సందేశం పంపించింది. ఇరాన్-ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని కోరింది. సాధ్యమైనంత మద్దతును అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్రిక్తతలను తగ్గించి.. చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అన్ని పరిస్థితుల్ని గమనిస్తున్నామని.. అవసరమైతే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ ముందుకొస్తుందని ప్రకటించింది. ఏ సమస్యకైనా పరిష్కారం దౌత్య మార్గాలేనని తెలిపింది.

ఇది కూడా చదవండి: Netherlands: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పసికూన నెదర్లాండ్స్‌.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!

ఇక భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని.. అనవసర ప్రయాణాలు ఆపుకోవాలని భారత్ సూచించింది. ఏదైనా సమస్య తలెత్తితే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తం అయ్యాయి.

ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్‌కు అణు కార్యక్రమానికి హృదయం లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. అందులో నటాంజ్ స్థావరం కూడా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో నెతన్యాహు ప్రకటించారు.

Exit mobile version