Pak DG Warns India: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. భారత క్షిపణులు పాకిస్తాన్ సైనిక స్థావరాలకు భారీ నష్టం కలిగించాయి. కానీ, పాకిస్తాన్ ప్రగల్భాలు పలకడం ఆపడం లేదు.. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. భారతదేశం ఇజ్రాయెల్ కాదు.. పాకిస్తాన్ పాలస్తీనా కాదని అన్నారు. అలాగే, కాశ్మీర్ అంశంపై కూడా అతడు భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేశారు.
Read Also: Rakul preet singh : దానికి వయసుతో సంబంధం లేదు..
ఇక, కాశ్మీర్ అనేది అంతర్జాతీయంగా వివాదాస్పద సమస్యగా పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ అభివర్ణించారు. అయితే, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని.. అది ఎల్లప్పుడూ ఉంటుందని ఇండియా పదే పదే చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. భారతదేశం అమెరికా కాదు.. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాదని ఆయన అన్నారు. భారతదేశం దాడి చేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది.. ఎందుకంటే, మాది ఉగ్రవాద బాధిత దేశమని పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అభివర్ణించారు.
