అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీతిసింగ్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడల్లోను సినిమాలు చేసింది. తెలుగులో అయితే మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని, రవితేజ, గోపీచంద్, నాగార్జున ఇలా దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. ఇక అవకాశాలు తగ్గడంతో మెల్లగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక హీరోయిన్‌గా కెరీర్ మంచి స్పీడ్‌లో ఉన్న టైం లోనే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లై నప్పటికీ ఈ అందాల తార క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగులో సినిమాలు చేయక పోయినప్పటికీ ప్రస్తుతం ఆమె జాబితాలో ‘దే దే ప్యార్ దే 2’. ‘ఇండియన్ 3’ తదితర సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ హీరోయిన్స్ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
రకుల్ మాట్లాడుతూ.. ‘నేను హీరోయిన్‌గా పెద్దతెరపై కనిపించాలనే ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. హీరోయిన్ ల పరిమిత కాలం చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లు మాత్రమే ఉంటుంది అని చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మీరు అద్భుతంగా పని చేసినన్ని రోజులు వయసుతో సంబంధం లేకుండా పరిశ్రమలో రాణించే అవకాశం ఉంది. నా వృత్తిలో నేను రోజూ ఉత్తమంగా ఉండక పోయినా పర్వాలేదు. కానీ తమ అభిమాన నటులగానే ఉండాలని కోరుకునే వారిలో పిల్లలు కూడా ఉంటారు. అందుకే. కథలను ఎంపిక చేసుకునేటప్పుడు ఆచితూచి అడుగులేయాల్సిన బాధ్యత నటీనటులపై ఎంతైనా ఉంది అని చెప్పుకొచ్చింది రకుల్.