Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుని వాయిదా వేయాలని పోలీసుల్ని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ ని అరెస్టు చేసేందుకు రెండురోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన నివాసానికి పెదయెత్తున బలగాలు వస్తున్నాయి. పోలీసులతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగుతున్నారు. దీంతో లాహోర్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుని వాయిదా వేయాలని ఆదేశించింది. లాహోర్ హైకోర్టు ఆదేశాలతో పోలీసుల అరెస్ట్ ఆపరేషన్ ఆగిపోయింది.
Read Also: YS Viveka murder case: అవినాష్‌రెడ్డి పిటిషన్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
ఇక, దీనికి ముందు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం బుధవారం ఏకంగా రేంజర్లను రంగంలోకి దించింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఇంటిముందు మంగళవారం పొద్దున ప్రారంభమైన హైడ్రామా బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. పోలీసులు, రేంజర్లపై పీటీఐ సపోర్టర్లు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో వారిపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఈ ఘటనలో మొత్తం 60 మంది గాయపడ్డారు. వీరిలో 54 మంది పోలీసులు ఉన్నారు. గాయపడిన వారు లాహోర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది ఇమ్రాన్ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా లాహోర్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది.