NTV Telugu Site icon

Imran Khan: ఆర్టికల్ 370ని పునరుద్దరిస్తేనే భారత్‌తో చర్చలు..

Imran Khan

Imran Khan

Imran Khan: తినడానికి తిండి దొరక్కున్నా, అప్పుల కోసం ప్రతీ దేశాన్ని అడుక్కుంటున్న పాకిస్తాన్ నాయకులకు బుద్ధి రావడంత లేదు. మళ్లీ కాశ్మీర్ పాటే పాడుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్ కూడా మరోసారి కాశ్మీర్ పై వ్యాఖ్యలు చేశారు. భారత్ తో చర్చలు జరిపేందుకు కాశ్మీర్ ప్రతేక్ హెదాను, ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ప్రధాని మోదీని కోరాడు. 2019లో భారత పార్లమెంట్ రాజ్యాంగంలో జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి జమ్మూకాశ్మీర్, లడఖ్ లుగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.

Read Also: Rahul Gandhi: ప్రధాని అదానీని రక్షిస్తున్నారని స్పష్టం అయింది.

లాహోర్ లో ఫారన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు ఇమ్రాన్ ఖాన్. చట్టబద్ధమైన పాలన లేకపోతే పాకిస్తాన్ కు భవిష్యత్తు ఉండదని, భారత్ నే తీసుకోండి అక్కడ చట్టబద్దపాలన ఉండటంతో పురోమిస్తోందని అన్నారు. నన్ను రాజకీయాలకు దూరంగా ఉంచడానికి దేశంలోని కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని.. నన్ను ఎన్నికల్లో పోటీ చేయాకుండా అనర్హుడిగా ప్రకటించడానికి వారు పథకం వేశారని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాల వెనక ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ ఉన్నాడా..? అని మీడియా ప్రశ్నిస్తే, అతడు కూడా ఉండే అవకాశం ఉందని ఇమ్రాన్ ఖాన్ బదులిచ్చాడు.

ప్రస్తుత లండన్ లో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తనను అనర్హుడిగా చేయడాని భావిస్తున్నారని దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ రానున్నట్లు ఇటీవల అతని పార్టీ ప్రకటించింది. పాకిస్తాన్ ముస్లింలీగ్(నవాజ్) పార్టీ దాని మిత్ర పక్షాలతో కలిసి రిగ్గింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ జావేద్ బజ్వాకు పదవీ పొడగింపు ఇవ్వడం తన అతిపెద్ద తప్పిదం అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సైనిక వ్యవస్థ ఎలా ఉంటుందో తాను అర్థం చేసుకోలేకపోయానని అన్నారు. షరీఫ్, జర్దారీలు అవినీతిపరుల పక్షం అని.. పాకిస్తాన్ సైన్యానికి, ప్రజలకు మధ్య అగాధం ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ దేశాన్ని దోచుకుంటున్నవారికి ఆర్మీ మద్దతు ఇస్తోందని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు.