కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నా.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. అయితే, కోవిడ్ వెలుగుచూసినప్పటి నుంచి పలు వార్నింగ్‌లతో ప్రపంచ దేశాలను, ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. అయితే కోవిడ్ మందగిస్తున్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం మనల్ని వదలడం లేదని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.. తాజాగా, మరోసారి కరోనా మహమ్మారి సంచలన విషయాలను వెల్లడించింది డబ్ల్యూహెచ్‌వో… కరోనా ప్రభావం మనపై దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.. ఆ వైరస్ ప్రభావం సుదీర్ఘకాలం ఉంటే దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందని వెల్లడించారు..
Read Also: దక్షణాదిపై మోడీ సర్కార్ వివక్ష.. కిషన్‌రెడ్డికి, సంజయ్‌కి దమ్ముంటే…?
ఇక, కోవిడ్ కట్టడి కోసం ఉద్దేశించిన వ్యాక్సినేషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్.. కామన్‌వెల్త్‌లోని జనాభాలో 42 శాతం మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్టు వెల్లడించారు.. ఆఫ్రికన్ దేశాలు సగటున 23 శాతం వ్యాక్సినేషన్ రేటును సాధించినట్టు పేర్కొన్న ఆయన.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో దేశాల మధ్య వ్యత్యాసం తగ్గాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.