Donald Trump: నేను చనిపోయాను అనుకున్నాను..
- కాల్పుల ఘటనపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్..
- కాల్పుల్లో చనిపోయాననే అనుకున్నాను..
- ఓ బుల్లెట్ నా చెవికి తాకింది: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో చెవికి తీవ్ర గాయమైంది. దీని గురించి తాజాగా ట్రంప్ రియాక్ట్ అయ్యారు. అసలు నేను మీ ముందు ఇలా ఉండేవాడినే కాదు.. కాల్పుల ఘటనలో చనిపోయాననే అనుకున్నాను.. ఇదొక చిత్రమైన పరిస్థితి అని ట్రంప్ తెలిపారు. ఆ సమయంలో ఆయన చెవికి బ్యాండేజ్ ఉండటం గమనించొచ్చు. ఇక, రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు విమానంలో ప్రయాణిస్తూ మాజీ అధ్యక్షుడు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదన్నారు. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతుందనేది అర్థమైందన్నారు.
Read Also: CMRF Applications: ఆన్లైన్లో మొదలైన సీఎం సహాయనిధి దరఖాస్తులు.. లింక్ ఇదే..
Also Read
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
ఇక, డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన తర్వాత అధ్యక్ష రేసు ఏకపక్షమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తూటా తాకిన వెంటనే కిందకు వంగి.. తర్వాత పిడికిలి బిగించి బలంగా పైకి లేచిన ట్రంప్ తీరు పలువురిని ఆకర్షించింది. యూఎస్ కు కావాల్సింది ఇలాంటి యోధుడే’ అని రిపబ్లికన్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆయన వ్యతిరేకులు కుట్ర సిద్ధాంతాలకు తెర తీశారని ఆరోపణలు గుప్పించారు. ఇదంతా సానుభూతి కోసమా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖంపై రక్తం.. పిడికిలి బిగించి ఎత్తిన చేయి.. వెనక అమెరికా జెండా.. చుట్టూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాంటి టైంలో కూడా ఇంత పర్ఫెక్ట్గా తీసిన ఫోటోపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ను నమ్మలేమంటూ పలువురు ఆ ఘటన దృశ్యాలను నెట్టింట షేర్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!