CMRF Applications: రాష్ట్రంలో నిధులు దుర్వినియోగం కాకుండా అర్హులకు చేరేలా రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. నేటి (సోమవారం) నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఆల్ లైన్ లింక్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు లాగిన్ ఐడీ కేటాయించారు. వారి వద్దకు వెళితే సీఎంఆర్‌ఎఫ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పేషెంట్ల వివరాలు నమోదు చేయనున్నారు. బాధితులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవేనా? కాదా అనే వివరాలను తెలుసుకోవడానికి పోర్టల్‌లో ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా సీఎంఆర్‌ఎఫ్‌ను పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధుల మళ్లింపు నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు.
Read also: Weather Report: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు
ఇక నుంచి ముఖ్యమంత్రి సీఎం సహాయనిధి దరఖాస్తులను https://cmrf.telangana.gov.in/ ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీఎంఆర్‌ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను తీసుకుని వారి సిఫార్సు లేఖను అప్‌లోడ్ చేస్తారు. దరఖాస్తులో సంబంధిత దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు. అప్లికేషన్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత CMRFకి సంబంధించిన కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సెక్రటేరియట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధారణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధిత ఆసుపత్రులకు పంపిస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, CMRF దరఖాస్తు ఆమోదించబడుతుంది. అనంతరం లబ్ధిదారునికి చెక్కును సిద్ధం చేస్తారు. దరఖాస్తుదారుని ఖాతా నంబర్ చెక్కుపై ముద్రించబడుతుంది. దీంతో చెక్ పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు స్వయంగా దరఖాస్తుదారులకు చెక్కులను అందజేస్తారు. https://cmrf.telangana.gov.in/ ఈ లింక్ ద్వారా దరఖాస్తును పూర్తి చేయాలని సూచించారు.
MP Vijayasai Reddy: మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారం వైసీపీదే..!