NTV Telugu Site icon

Israel-Iran: మా జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయి.. ఇరాన్ కమాండర్ వార్నింగ్

Iraniancommander

Iraniancommander

ఇరాన్ జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్‌కు ఇరాన్ కమాండర్ హసన్ సలామీ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్‌ దాడిలో చనిపోయిన జనరల్‌ అబ్బాస్‌ నీలోఫర్సన్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న హసన్‌ సలామీ ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ఈ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సరఫరా చేసే క్షిపణి వ్యవస్థపై కూడా విమర్శలు గుప్పించారు. ఈ వ్యవస్థలను ఇజ్రాయెల్ విశ్వసించవద్దని కోరారు. ముస్లిం దేశాలను ఎవరూ ఏం చేయలేరన్నారు. ఒకవేళ దాడులు చేస్తే సురక్షితంగా ఉండలేరని హెచ్చరించారు. ఒకవేళ పొరపాటు చేసి ఇరాన్‌ లక్ష్యాలపై దాడి చేస్తే.. తిరిగి బాధపడేలా దాడులు చేస్తామని హసన్ సలామీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: KTR: తెలంగాణ భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో ముగిసిన సమావేశం.. కేటీఆర్‌ కీలక నిర్ణయం

ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. కొన్నింటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్ భూభాగంలో పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఐడీఎఫ్ దళాలు తెలిపాయి. అయితే ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఇక అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా.. ఇరాన్ చమురు, అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అదునుకోసం కనిపెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చన్న తరుణంలో ఇరాన్ కమాండర్ హసన్ సలామీ హెచ్చరికలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో… వైరల్