ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు.. ఇరాన్ టాప్ కమాండర్ అలీ షాద్మానీ ప్రాణాలు వదిలారు.
ఇరాన్ జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్‌కు ఇరాన్ కమాండర్ హసన్ సలామీ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ అంత్యక్రియల్లో పాల్గొన్న హసన్ సలామీ ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ఈ హెచ్చరికలు జారీ చేశారు.