NTV Telugu Site icon

Microsoft: ‘‘మీకెంత ధైర్యం?’’.. మైక్రోసాఫ్ట్ బాస్‌లపై భారత సంతతి టెక్కీ ఆగ్రహం.. కారణం ఇదే..

Microsoft

Microsoft

Microsoft: మైక్రోసాఫ్ట్ బాస్‌లపై భారత సంతతికి చెందిన ఒక ఇంజనీర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాజాలో మారణహోమానికి ఇజ్రాయిల్‌కి సాంకేతిక సహాయం చేశారని వానియా అగర్వాల్ అనే టెక్కీ ప్రశ్నించింది. ఇజ్రాయిల్ సైనిక చర్యలలో మైక్రోసాఫ్ట్ భాగస్వామి అని ఆమె ఆరోపించింది. మైక్రోసాఫ్ట్ బాస్‌లు సత్య నాదెళ్ల, స్టీవ్ బాల్మెర్, బిల్ గేట్స్ ముగ్గురూ ఉన్న సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి ఆగ్రహంలో వీరంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సం సమయంలో వానియా వీరిని తీవ్రంగా విమర్శించింది.

‘‘గాజాలో 50,000 మంది పాలస్తీనియన్లు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీతో హత్యకు గురయ్యారు. మీకు ఎంత ధైర్యం..? వారి రక్తంతో వేడుకలు జరుపుకుంటున్నందుకు మీకు సిగ్గు ఉండాలి’’ అని కోపం వ్యక్తం చేసింది. నేను మైక్రోసాఫ్ట్ ఉద్యోగిని, దీనికి నేను అంగీకరించను, 50,000 మంది పాలస్తీనియన్లు చంపబడ్డారని చెప్పింది. మైక్రోసాఫ్ట్ ‘‘డిజిటల్ ఆయుధాల తయారీదారు’’ అని పిలుస్తూనే, కంపెనీ తన టెక్నాలజీ ద్వారా హింసను ప్రారంభిస్తోందని ఆరోపించింది.

Read Also: MI vs RCB: ఆర్సీబీపై బుమ్రాకు అద్భుత రికార్డు.. ఆ ప్రదర్శన ఎవరూ మరవలేనిది!

మరొక మహిళ ఆమెను హాలు నుంచి బయటకు తీసుకెళ్లే ముందు, ఇజ్రాయిల్‌తో సంబంధాలు తెంచుకోవాలని కోరింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖతో $133 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసినందుకు, పాలస్తీనియన్లపై సైనిక చర్యలలో దాని AI, అజూర్ టెక్నాలజీని వాడినందుకు మైక్రోసాఫ్ట్‌పై వానియా అగర్వాల్ తీవ్రంగా విమర్శించింది. ఆ తర్వాత తన రాజీనామాను ప్రకటించింది. మానవ హక్కుల ఉల్లంఘన ఉన్నందు వల్ల సహోద్యోగులు కూడా నిరసన తెలపాలని పిలుపునిచ్చింది.

తన రాజీనామా లేఖలో.. ‘‘నేను మంచి మనస్సాక్షితో, ఒక కంపెనీలో భాగం కాలేను. మీరు మైక్రోసాఫ్ట్‌లో పని చేయడం కొనసాగించాల్సి వస్తే, మీ స్థానం, అధికారం, ప్రత్యేక హక్కును ఉపయోగించి మైక్రోసాఫ్ట్‌ను దాని స్వంత విలువలు, లక్ష్యానికి జవాబుదారీగా ఉంచాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’ అని పేర్కొంది. వానియా అగర్వాల్ మరో ఉద్యోగి ఇబ్తిహాల్ అబౌసాద్, కంపెనీ AI CEO ముస్తఫా సులేమాన్ చేసిన ప్రెజెంటేషన్‌ను అడ్డుకుని, అతన్ని “యుద్ధ లాభదాయకుడు” అని ఆరోపించింది. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీని జాతి వినాశక చర్యలకు ఉపయోగిస్తుందని చెప్పింది.

గతంలో కూడా, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇజ్రాయెల్‌తో ఉన్న సంబంధాలపై కంపెనీని విమర్శించారు, ఇది హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చెడిపోయిన తర్వాత గాజాలో ఇజ్రాయిల్ మరోసారి హింసను ప్రారంభించింది. ఫిబ్రవరిలో, కాంట్రాక్టులను నిరసిస్తున్నందుకు సత్య నాదెల్లాతో జరిగిన సమావేశం నుండి ఐదుగురు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించారు.