Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పతనం అంచుకు చేరుకుంది. అక్కడి ప్రజలకు నిత్యావసరాలు లభించడం లేదు. పిండి, వంటనూనెలు, నెయ్యి, వంట గ్యాస్, కరెంట్ ఇలా అన్నింటా కొరతే. ద్రవ్యోల్భణం ఆల్ టైం హైకి చేరుకుంది. దీంతో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. అయితే అక్కడి నాయకులు మాత్రం ఆర్థిక సంక్షోభానికి వింతవింత పరిష్కారాలు చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రి పాకిస్తాన్ ను ఇస్లాం పేరుమీద అల్లా సృష్టించాడని..ప్రజలను కూడా అల్లానే ఆదుకుంటాడంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Revanth Reddy : 2003 నాటి పరిస్థితులు.. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది
ఇదిలా ఉంటే తెహ్రీక్-ఇ-లబ్బీక్ నేత సాద్ రిజ్వీ లాహోర్ లో జరిగిన ఓ సభలో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభ పరిష్కారానికి ఓ కొత్త ప్రతిపాదన సూచించాడు. ప్రస్తుతం ఇతని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆర్థిక సంక్షోభం కోసం పాక్ ప్రభుత్వం అన్ని దేశాలను అడ్డుకుంటుందని.. అలా కాకుండా పాక్ క్యాబినెట్ కుడి చేతిలో ఖురాన్, మరో చేతిలో అణు బాంబు సూటికేస్ పట్టుకుని స్వీడన్ చేరాలని సూచించారు. మీరంతా ఖురాన్ ను రక్షించడానికి ఇక్కడి వచ్చామని చెప్పండి, ప్రపంచంలోని అన్ని వరాలు మీకు వస్తాయని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ ప్రతీ ఇంటికి వెళ్లి భిక్ష అడుక్కోవద్దని ఇదే పరిష్కారం అని.. ఇలా చేస్తే ప్రపంచం అంతా మన పాదాల చెంతకు చేరుతుందని, లేకపోతే నా పేరు మార్చుకుంటా అంటూ సవాల్ కూడా విసిరాడు.
ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. జీడీపీ-పాకిస్తాన్ అప్పుల నిష్పత్తి 70 శాతం ప్రమాదంలో ఉంది. కేవలం మూడు వారాలకు సరిపోయే విధంగా పాక్ విదేశీమారక నిల్వలు ఉన్నాయి. కేవలం 3.09 బిలియన్ డాలర్ల ఫొరెక్స్ నిల్వలు మాత్రమే పాకిస్తాన్ వద్ద ఉన్నాయి. మరోవైపు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం పాక్ చర్చలు జరుపుతోంది. ఐఎంఎఫ్ విధించే షరతులకు తలొగ్గితేనే రుణం పుట్టే అవకాశం ఉంది. అయితే ఇదే జరిగితే పాక్ ప్రజలు జీవనప్రమాణాలు మరింతగా దిగజారుతాయి. కాకపోతే పాకిస్తాన్ కు మరో మార్గం లేదు.
ऐसे भीख कौन माँगता है भाई 😄
Tehreek-e-Labbaik पाकिस्तान के नेता हाफिज साद रिज़वी कह रहे हैं कि पाकिस्तान को एक हाथ में क़ुरान और दूसरे हाथ में न्यूक्लियर बम लेकर दुनिया को कह देना चाहिये कि या तो पैसे दे दो वरना हम न्यूक्लियर बम फोड़ देंगे pic.twitter.com/Pj9Yk2n5fu
— Major Surendra Poonia (@MajorPoonia) February 4, 2023
