Bangladesh: శ్రద్ధా హత్య తరహాలోనే హిందూ యువతిని చంపి, ముక్కలు చేసిన లవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu girl chopped into pieces by lover in Bangladesh: దేశవ్యాప్తంగా శ్రద్ధా వాకర్ హత్య సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాలా దారుణంగా చంపేశారు. మే నెలలో ఈ హత్య జరిగితే శ్రద్ధా తండ్రి ఫిర్యాదులో ఇటీవల వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ప్రతీ రోజూ రాత్రి వేళల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా శ్రద్ధా హత్య తరహాలోనే బంగ్లాదేశ్ లో మరో హిందూ యువతిని దారుణంగా చంపాడు ఆమె ప్రేమికుడు. అబూ బకర్ అనే వ్యక్తి హిందూ యువతి కవితా రాణిని ప్రేమించాడు. ఆమెను దారణంగా చంపేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 6న అబూబకర్ ఉద్యోగానికి రాకపోవడంతో అతను పనిచేస్తున్న రవాణా సంస్థ యజమాని మరో వ్యక్తిని అబూబకర్ ఇంటికి పంపిన సందర్భంలో ఈ దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. అబూబకర్ ఇంటికి వచ్చిన వ్యక్తి అతని ఇంటికి బయటనుంచి తాళం వేసి ఉండటం, అబూబకర్ అదృశ్యంపై అనుమానం పెరగడంతో యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
- Elon Musk: మస్క్‌కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
Read Also: 2011 Phool Mohammad case: పూల్ మహ్మద్ హత్య కేసులో మాజీ డీఎస్పీతో సహా 30 మందికి యావజ్జీవం..
పోలీసులు వచ్చి ఇంట్లో సోదా చేయగా.. ఒక పెట్టెలో తలలేని యువతి మృతదేహం కనిపించింది. ఆమె తలను పాలిథిన్ కవర్ లో చుట్టి వేరుగా ఉంచాడు నిందితుడు, మృతదేహం నుంచి చేతులను వేరు చేశాడు. పోలీసులు నవంబర్ 7న నిందితుడు అబూబకర్ తో పాటు ఆమె మరో లవర్ సప్నాను అరెస్ట్ చేశారు. అబూ బకర్, సప్నా గత నాలుగేళ్లుగా గోబర్చక స్వ్కేర్ ప్రాంతంలో కలిసి నివాసం ఉంటున్నారు. అబూబకర్ ఇటీవల కాలంలో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ క్రమంలో నవంబర్ 5న సప్నా ఉద్యోగానికి వెళ్లిన సమయంలో అబూ బకర్ కవితను తన ఇంటికి రమ్మన్నాడు. ఈ సమయంలో కవిత, అబూబకర్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కోపంతో అబూబకర్, కవితారాణి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తలను వేరు చేసి, ఆమె చేతులను నరికి కాలువలో పారేశాడు. తలను పాలిథిన్ కవర్లో ఉంచి మిగిలిన మృతదేహాన్నని బాక్సులో పెట్టి పారిపోయాడు.
అదే రోజు రాత్రి అబూబకర్ తన లివ్ ఇన్ పార్ట్నర్ సప్నాతో కలిసి రూప్సా నదిని దాటి ఢాకాకు పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్య ఘటన వెలుగులోకి రావడంతో సెర్చ్ ఆపరేషన్ చేసి అబూ బకర్ ని అరెస్ట్ చేశారు. ఘాజీపూర్ జిల్లా బసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబూబకర్, సప్నాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?