Putin: పుతిన్‌ని విమర్శించిన సీనియర్ సైనిక అధికారి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: రష్యా అధినేత పుతిన్‌ని విమర్శించిన సీనియర్ మిలిటరీ జనరల్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. లెఫ్టినెంట్ జనరల్ స్విరిడోవ్, స్టావ్‌రోపోల్ ప్రాంతంలోని అతని ఇంటిలో చనిపోయినట్లు రష్యన్ మీడియా తెలియజేసింది. 6వ వైమానికదళం, ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ స్విరిడోవ్ మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. ఇతని శవం పక్కనే ఒక మహిళ శవం పడిఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఎవరనేదానిని ఇంకా గుర్తించలేదు. ఇతర మీడియా నివేదికల ప్రకారం ఆమె అతని భార్య అని చెబుతున్నారు. అయితే చనిపోయే ముందు ఎలాంటి పెనుగులాట, హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లభించలేదని, ఎలా చనిపోయారనే దానిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గదిలో ఎలాంటి విషపూరిత పదార్థాల ఆనవాళ్లు దొరలేదని రష్యా అధికారులు తెలిపినట్లు మీడియా నివేదించింది.
Read Also: Business News: పెళ్లిళ్ల సీజన్‌పై వ్యాపారవేత్తల కళ్లు.. 25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా..!
Also Read
- Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
- BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
- Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
- Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి!
గతంలో ఈ ఆర్మీ అధికారి పుతిన్ తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. రష్యన్ మ్యాగజూన్ టేక్ఆఫ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలోని పైలెట్లకు తగిన శిక్షణ ఇవ్వడం లేదని చెప్పారు. పూర్తి పోరాట సంసిద్ధత కోసం పైలెట్ ఏడాదికి 100 గంటల ఫ్లైట్ టైమ్ ఉండాలి, అయితే ప్రస్తుతం సైన్యంలో సగటు ఫ్లైట్ టైమ్ 25-30 గంటలుగా ఉందని ఆరోపించారు. మంచివారు లేనందున పూర్తి శిక్షణ లేని అధికారులను నియమించాల్సి వస్తోందని, అదే కారణంగా మేము మిలిటరీ అకాడమీలోని థర్డ్ ర్యాంక్ పైలెట్లను పంపుతున్నామని, ఇది గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు.
లెఫ్టినెంట్ జనరల్ స్విరిడోవ్ తన కెరీర్లో ‘ఆర్డర్ ఆఫ్ ది రెడ్ స్టార్’ గౌరవాన్ని అందుకున్నారు. రష్యాలోనే అత్యంత కీలకమైన పైలెట్ అయ్యారు. ఇతను రష్యాలోని పైలెట్ల పేద స్థితిగతుల్ని కూడా హైలెట్ చేశాడు. యువ అధికారులకు, సైనికులందరికీ సాధారణ జీవన పరిస్థితులు సృష్టించమని తద్వారా వారు తమ సేవా విధులను సరిగా నిర్వర్తిస్తారని అధ్యక్షుడు పుతిన్‌కి నేరుగా చెప్పాడు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!