Israel – Hezbollah: హెజ్‌బొల్లా రాకెట్లతో దాడి.. కూల్చేసిన ఇజ్రాయెల్
- ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడి చేసిన హెజ్‌బొల్లా..
- సురక్షిత బంకర్లలోకి వెళ్లి పోయిన 10 లక్షల మంది ఇజ్రాయెలీలు..
- ఈ రాకెట్ల దాడితో విమాన సేవలకు కొంత అంతరాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel – Hezbollah: ఇజ్రాయెల్ మధ్య ప్రాంతంపై హెజ్‌బొల్లా మంగళవారం రాకెట్లతో దాడికి దిగింది. ఇక, వాటిని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. ఒక రాకెట్ నిర్మానుష్య ప్రాంతంలో పడగా.. ఒక రిజర్విస్టు సైనికుడు మరణించినట్లు వెల్లడించారు. ఈ దాడుల నేపథ్యంలో 10 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు సురక్షిత బంకర్లలోకి వెళ్లి పోయారు. అలాగే, విమాన సేవలకు కొంతమేర అంతరాయం కూడా కలిగింది. మరోవైపు సోమవారం రాత్రి ఇజ్రాయెల్ చేసిన దాడిలో 13 మంది లెబనాన్ వాసులు చనిపోయారు. ఇటు పశ్చిమాసియాలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. కాల్పుల విరమణకు అవకాశం తక్కువగా ఉందన్నారు. హెజ్‌బొల్లా మంగళవారం ఇజ్రాయెల్‌లోని జన సమర్థ ప్రాంతాలపై రాకెట్ దాడులు చేసినప్పటికి.. ఎలాంటి నష్టం జరగలేదని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. బ్లింకెన్ ఇజ్రాయెల్‌కు రావడానికి కొద్ది గంటల ముందు ఈ దాడులు కొనసాగాయి.
Read Also: Devara : NTR పడిన కష్టానికి ఆడియెన్స్ ‘లాల్ సలామ్’
Also Read
ఇక, లెబనాన్ నుంచి హెజ్‌బొల్లా గ్రూప్ 5 ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించింది. వాటిలో ఒక్కటి మినహా అన్నింటినీ క్షిపణి రక్షణ వ్యవస్థ అడ్డుకుందని ఇజ్రాయెల్ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఒకటి నిర్మానుష్య ప్రాంతంలో పడగా.. దీని కారణంగా బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. బీరుట్‌లోని ప్రధాన ఆసుపత్రి ప్రాంతంలో సోమవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 13 మంది చనిపోయారని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 57 మంది గాయపడ్డారని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!