Site icon NTV Telugu

Helicopter Crash : పర్వత ప్రాంతంలో కూలిన హెలికాప్టర్‌.. 7గురు మృతి

Helicopter Crash

Helicopter Crash

ఇటలీలో ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పైలట్​ సహా ఏడుగురు మృతిచెందారు. అయితే మృతుల్లో నలుగురు టర్కీకి చెందినవారు కాగా.. ఇద్దరు లెబనీస్ పౌరులు. గురవారం ఓ ప్రవేట్​ చాపర్​ ఉత్తర-మధ్య ఇటలీలో దట్టమైన అడవులు, పర్వతప్రాంతంలోకి వెళ్లాక అదృశ్యమైంది. ఈ క్రమంలో రాడార్​ సంబంధాలు తెగిపోవడంతో.. గాలింపు చేపట్టిన అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి ఆచూకీ లభించలేదు.

అయితే శనివారం ఉదయం ఓ పర్వతారోహకుడు హెలికాప్టర్ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన వారు సహాయక చర్యలు చేపట్టారు. మొదట ఐదు మృతదేహాలను గుర్తించగా.. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. దీంతో హెలికాప్టర్​లో ఉన్న ఏడుగురు మరణించినట్లైంది. దట్టమైన అడవి కావడం వల్ల హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశాన్ని త్వరగా గుర్తించలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతమంటా చెట్లు ఉండటం వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తిందని, మొదట హెలికాప్టర్ కూలిన 10 కిలోమీటర్ల దూరంలో గాలింపు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. రాడార్ వ్యవస్థతో సంబంధాలు లేకపోవడం వల్ల హెలికాప్టర్ జాడ కనిపెట్టలేకపోయినట్లు అధికారులు వివరించారు.

Exit mobile version