Israel-Hamas: నేడు ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ కీలక చర్చలు.. బందీల విడుదలపై వీడనున్న ఉత్కంఠ
- నేడు ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ కీలక చర్చలు
- బందీల విడుదలపై వీడనున్న ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి మంగళవారంతో రెండేళ్లు పూర్తవుతుంది. అనంతరం గాజాపై ఏకధాటిగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈజిప్టు వేదికగా సోమవారం కీలక సమావేశం జరగబోతుంది. ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఖతార్ విదేశాంగమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ థాని సారథ్యంలో చర్చలు జరగనున్నాయి. ఇజ్రాయెల్ పరోక్షంగా పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఈ చర్చల్లో కాల్పుల విరమణ, బందీల విడుదలపై చర్చించనున్నారు. చర్చలు ఫలిస్తే.. వెంటనే హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ ఒకేసారి విడుదల చేయనున్నారు. అలాగే ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తారు.
ఇది కూడా చదవండి: Jaipur: జైపూర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది రోగులు మృతి
ఇదిలా ఉంటే ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. గడచిన 24 గంటల్లో 65 మంది పాలస్తీనియన్లు చనిపోయారని హమాస్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. ఇక పాలస్తీనియన్లకు మద్దతుగా తుర్కియేలోని అంకారా, ఇస్తాంబుల్‌లో, నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో భారీస్థాయిలో ప్రదర్శనలు జరిగాయి.
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి యుద్ధం సాగుతూనే ఉంది. రేపటితో రెండేళ్లు పూర్తి చేసుకుంటుంది. మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో పలువురు బందీలను హమాస్ విడుదల చేసింది. పూర్తిగా విడిచిపెట్టకపోవడంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మధ్య ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. దీనికి ఇజ్రాయెల్ మద్దతు తెల్పగా.. హమాస్ స్పందించలేదు. దీంతో ప్రణాళికకు అంగీకారం తెల్పకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. దీంతో హమాస్ దిగొచ్చి చర్చలకు అంగీకారం తెలిపింది. మొత్తానికి సోమవారం కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతా సవ్యంగా జరిగితే సోమవారమే బందీలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!