Solar Cycle: సూర్యుడిపై గందరగోళ పరిస్థితి.. ఒక సౌర చక్రం పూర్తికాక ముందే, మరొకటి ప్రారంభం..
- సోలార్ మాగ్జిమంకి చేరకున్న సౌరచక్రం..
- ఒక సోలార్ సైకిల్ పూర్తికాక ముందే మరొకటి..
- 2030 నాటికి ప్రారంభం కానున్న 26వ సోలార్ సైకిల్..
- పరిశోధనల్లో కీలక విషయాలు..
Solar Cycle: సూర్యుడు ప్రస్తుతం తన 25వ ‘సోలార్ సైకిల్’(సౌర చక్రం)లో ఉన్నాడు. 11 ఏళ్ల పాటు సాగే ఈ ప్రక్రియలో ప్రస్తుతం సగం కాలం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సోలార్ సైకిల్ గరిష్టానికి చేరుకుంది. దీనిని ‘సోలార్ మాగ్జిమం’గా వ్యవహరిస్తుంటారు. దీని కారణంగానే సూర్యుడిపై నిరంతర పేలుళ్లు, సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ)లు ఏర్పడుతుంటాయి. సూర్యుడి నుంచి సౌర జ్వాలలు ఎగిసిపడుతుంటాయి. వీటి కారణంగా భూమిపై ‘‘భూ అయస్కాంత తుఫానులు’’ ఏర్పడుతుంటాయి.
ప్రతీ సోలార్ సైకిల్లో సూర్యుడిపై ఉండే అయస్కాంత ధృవాలు మారుతాయి. ఇలా మార్చుకునే సమయంలో సూర్యుడి వాతావరణంపై గందరగోళం ఏర్పడుతుంది. దీని అయస్కాంత క్షేత్రాల బలాల వల్ల సూర్యుడిపై భారీ విస్ఫోటనాలు ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం సూర్యుడిపై ఈ సోలార్ సైకిల్ 2019లో ప్రారంభమైంది. ఇది 2025 మధ్యకాలం నాటికి ఈ ధృవాల మార్పుతో సూర్యుడిపై కార్యకలాపాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. దీనిని సోలార్ మాగ్జిమం అని చెబుతారు. ఈ సమయంలో ఎక్కువగా సన్స్పాట్లు, సౌరజ్వాలలు మరియు కరోనల్ మాస్ ఎజెక్షన్లు ఏర్పడుతాయి. వీటిని ఇప్పటికే మనం గమనిస్తున్నాం.
Also Read
- Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
Read Also: ISRO somanath: ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్న ఇస్రో చైర్మన్
భూమిపై వీటి ప్రభావం చాలా ఉంటుంది. సూర్యుడి నుంచి దూసుకొచ్చే సౌర జ్వాలలు ఫలితంగా భూమిపై ‘‘జియో మాగ్నెటిక్ తుఫానులు’’ ఏర్పడుతున్నాయి. వీటి ఫలితంగా భూమి ధృవాల వద్ద ప్రకాశవంతమైన అరోరాలు ఏర్పడుతున్నాయి. భూమికి ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రం వల్ల సమస్త మానవాళి రక్షించబడుతున్నారు. సూర్యుడి నుంచి వచ్చే ఈ ప్రమాదకరమైన తుఫానులను భూ అయస్కాంత క్షేత్రం తిప్పికొడుతుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఉన్న సోలార్ సైకిల్ మరో ఆరేళ్ల పాటు సాగుతుంది. అయితే తాజా పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధనల్లో సూర్యుడు మరో ‘సౌర చక్రాన్ని’ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సంకేతాలను పరిశోధకులు గుర్తించారు. సూర్యునిలోని అంతర్గత ధ్వని తరంగాల ద్వారా సౌర చక్రం 26 యొక్క ప్రారంభ సంకేతాలను గుర్తించింది. ప్రతి సౌర చక్రం ప్రారంభమయ్యే ముందు సూర్యుడి ఈక్వేటర్ వైపు పదార్థం వేగంగా కదులుతుంది. ఈ మార్పులు 2030 నాటికి ప్రారంభమయ్యే 26వ సోలార్ సైకిల్ మొదటి సూచనలు అందించాయి.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?