మనం జుట్టుకు రంగు ఎందుకు వేసుకుంటాం. తెల్ల వెంట్రుకలతో చూసేందుకు నలుగురిలో ఇబ్బంది అవుతుందని వాడుతుంటాం. కొంత మంది యువకులు మాత్రం స్టైల్ అంటూ కెమికల్స్ ఉండే కలర్ హెయిర్ డైస్ వాడుతుంటారు. దీంతో కాన్సర్, తదితర రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనే ఒకటి చైనాలో జరిగింది.
Read Also:Tejas Express: మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్ ట్రైన్ గురించి మీకు తెలుసా..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రతి నెలా జుట్టుకు రంగు వేసుకున్న తర్వాత, ఒక యువతి మూత్రపిండాల వ్యాధితో ఆసుపత్రిలో చేరింది. హువాగా గుర్తించబడిన 20 ఏళ్ల మహిళ తనకు ఇష్టమైన సెలబ్రిటీకి సరిపోయేలా తన జుట్టు రంగును మార్చుకునేది.. జుట్టు రంగు మార్పులను పునరావృతం చేయడానికి క్రమం తప్పకుండా సెలూన్‌లకు వెళుతూ ఉండేది. ఇలా చేయడంతో ఆమె కాళ్లపై ఎర్రటి మచ్చలు, కడుపు నొప్పి, కీళ్లలో అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మూత్ర పిండాలు పనిచేయడంలేదని వెల్లడించారు. దీనికి ఆ యువతి తరచూ తన జుట్టు రంగును మార్చడమే కారణమని వారు తెలిపారు.
Read Also:Friends Attacked Private Parts:మీరేం ఫ్రెండ్స్ రా … బాగా తాగి.. స్నేహితుడిని ఏం చేశారో తెలుసా..
చైనాకు చెందిన 20ఏళ్ల అమ్మాయి ప్రతీ నెల హెయిర్ డై వాడుతుండటంతో కిడ్నీ వ్యాధి వచ్చినట్లు తెలిపారు వైద్యులు. కె-పాప్ డ్రామాను ఫాలో అవుతున్న ఆమె.. కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేసేందుకు హెయిర్ డైయింగ్ చేస్తూ ఉండేది. ఈ అలవాటు తల ద్వారా విషపూరిత రసాయనాలు శోషించేందుకు కారణమై చివరకు దీర్ఘకాలిక కిడ్నీ డ్యామేజ్‌కు దారితీసింది. ముందుగా ఆమెకు తలనొప్పి స్టార్ట్ కాగా ఆ తర్వాత కాళ్లపై ఎర్రటి మచ్చలు, జాయింట్ పెయిన్, కడుపు నొప్పి రావడంతో డాక్టర్లను ఆశ్రయించింది. ఈ లక్షణాలను గమనించిన వైద్యులు.. కెమికల్ ఎక్స్‌పోజర్ వల్ల వచ్చిన యాక్యూట్ ఇంటర్‌స్టీషియల్ నెప్రైటిస్‌తో లింక్ చేశారు. తలలోని పోరస్ స్కిన్ ద్వారా రక్తంలోకి ప్రవేశించిన టాక్సిన్స్ స్థాయిల్ పెరగ్గా.. ఈ పరస్థితి రెనలక ఫెయిల్యూర్‌కు దారితీసే స్థాయికి చేరింది.
Read Also:BJP MLA: రీల్స్ చేస్తూ… కాలుజారి నదిలో పడిపోయిన ఎమ్మెల్యే…
హెయిర్ డై పారా-ఫెనిలెన్‌డైయామిన్ (PPD) అనే రసాయనాన్నికలిగి ఉంటుంది. ఇది పదేపదే ఉపయోగించడం వల్ల అలర్జిక్ రియాక్షన్స్, ఆర్గాన్ డ్యామేజ్‌కు కారణమవుతుంది. టాక్సిన్స్‌లో లెడ్, మెర్క్యురీ వంటి హెవీ మెటల్స్ ఉంటాయి. తరుచుగా వాడితే హెయిర్‌పై సులభంగా శోషించబడతాయి. కాగా PPDకు దీర్ఘకాలిక ఎక్స్‌పోజర్ ఉన్న మహిళలపై జరిగిన అధ్యయనం… చిరోస్ట్ కిడ్నీ డిసీజ్ (CKD)తో గణనీయమైన సంబంధాన్ని గుర్తించింది..