Gay Prince Marriage: అమెరికాలో వైభవంగా ‘గే’ యువరాజు పెళ్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌కు చెందిన ‘గే’ యువరాజు మన్వేంద్ర సింగ్ గోహిల్ ఓ స్వలింగ సంపర్కుడిని వివాహం చేసుకున్నాడు. 2022 జులై 6న అమెరికాలోని కొలంబస్‌లో డీఆండ్రీ రిచర్డ్సన్ను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. డీఆండ్రీ రిచర్డ్‌సన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ సమాచారాన్ని అందించాడు. ప్రిన్స్ మన్వేంద్ర సింగ్ డీఆండ్రీ రిచర్డ్‌సన్ చాలా సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. ఆండ్రీ రిచర్డ్‌సన్ సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను కూడా పంచుకున్నారు.
మన్వేంద్ర సింగ్ గోహిల్ రాజ కుటుంబంలో జన్మించాడు. మన్వేంద్ర సింగ్.. మహారాజా రఘువీర్ సింగ్ రాజేంద్ర సింగ్, రాణి రుక్మిణీ దేవిల కుమారుడు. అతను ముంబై స్కాట్స్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. ముంబై మిథిబాయి కాలేజీ క్యాంపస్‌లో ఉన్న అమృత్‌బెన్ జీవన్‌లాల్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. తన వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా లేదని, ఓ అమ్మాయి జీవితాన్ని పాడుచేశానంటూ పశ్చాత్తాపపడ్డానని.. ఒకసారి తన భార్య నుంచి విడాకుల గురించి ఎమోషనల్ పోస్ట్‌లో చెప్పాడు. 2006లో, అతను ‘గే’ అని ఒప్పుకున్నాడు. తనను తాను ‘గే’గా ప్రకటించుకున్న మన్వేంద్ర సింగ్.. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు పొందారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
2006లో మన్వేంద్ర స్థానిక వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తాను స్వలింగ సంపర్కుడినని చెప్పాడు. ఆయన స్వలింగ సంపర్కం గురించి బహిరంగంగా మాట్లాడిన భారతదేశంలోని రాజకుటుంబాల్లోనే మొదటివాడు. ఇదేదో గొప్పగా అనిపిస్తుందని అనిపిస్తుంది, కానీ ఆ సమయంలో చాలా రచ్చ జరిగింది. ఇప్పుడు సినిమా షూటింగ్ కోసం తమ హెరిటేజ్ ప్యాలెస్‌ని రిసార్ట్‌గా, స్టూడియోగా మార్చారు. ఆయన ప్యాలెస్‌లో ‘గే’ సెంటర్‌ను ప్రారంభించారు.
CI Nageshwar Rao : రాచకొండ పోలీసులను బురిడీ కొట్టిన నాగేశ్వర్ రావు
స్వలింగ సంపర్కుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు మన్వేంద్ర సింగ్. రాజ్పిప్లాలో స్వలింగ సంపర్కుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అమెరికా రచయిత జనేత్ పేరును పెట్టారు. ఈ ఆశ్రమం ఆసియా ఖండంలోనే మొట్టమొదటిది స్వలింగ సంపర్కుల ఆశ్రమంగా పేరొందింది. ఈ ఆశ్రమం కోసం జనేత్.. అన్ని విధాలుగా సాయం చేశారని, అందుకే ఆమె పేరు మీదుగా ఆశ్రమం నెలకొల్పినట్లు సింగ్ తెలిపారు. స్వలింగ్ సంపర్కులకు ఆశ్రమాన్ని నిర్మించాలనే ఆలోచన 2009లో వచ్చిందని మానవేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఆశ్రమాన్ని ప్రారంభించడానికి జనేత్ సోదరి కార్ల్ఫైన్ తన భర్తతో కలిసి అమెరికా నుంచి వచ్చారు.

వివాహ ధ్రువీకరణ పత్రం

ధ్రువీకరణ పత్రాన్ని చూపిస్తున్న యువరాజు
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!