NTV Telugu Site icon

Bangladesh Temple: బంగ్లాదేశ్‌లో ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చిన కాళీ దేవి కిరీటం చోరీ..

Ban

Ban

Bangladesh Temple: బంగ్లాదేశ్ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాల ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గాపూజ సందర్భంగా బంగ్లాలో 4 రోజుల పాటు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే, మరోవైపు బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరా నగరంలోని శ్యామ్‌నగర్‌లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని బంగారు కిరీటం అపహరణకు గురైంది. ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి.

Read Also: UBIT Coin Case: యూబిట్ కాయిన్ కేసు పై ఈడీ నజర్.. నిర్మల్ పోలీసులకు లేఖ..

కాగా, బంగ్లాదేశ్‌లోని ఈ కాళీ ఆలయ కిరీటంతో ప్రధాని మోడీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 2021లో ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అంతేకాదు, ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ ప్రత్యేక సందర్భంలో దొంగతనం చేశారు.

Read Also: Deputy CM Pawan Kalyan: హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. సొంత డబ్బుతో స్కూల్‌కు ప్లే గ్రౌండ్‌..

ఇక, ఈ ఆలయంలో దొంగతనం జరిగిన సంఘటన అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం 2:50 గంటల మధ్య చోటు చేసుకుంది. ఆలయ పూజారి దిలీప్ కుమార్ బెనర్జీ రోజువారీ పూజను పూర్తి చేసిన తర్వాత దేవాలయానికి తాళాలు దాని నిర్వహణ బాధ్యత రేఖ సర్కార్‌కు అప్పగించారు. అయితే, ఇతర పనుల్లో నిమగ్నమైన రేఖ సర్కార్.. తిరిగి వచ్చి చూసే వరకు కాళీ మాతకు ధరించిన బంగారు కిరీటం కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు కొనసాగిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఫకర్ తైజుర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఇచ్చిన బహుమతి దొంగిలించారని.. దానిని కనుగొనడానికి ట్రై చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని గుర్తించడానికి సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments