Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- జర్మనీలో దుండగుడు కాల్పులు
- ఐదుగురు మృతి.. నిందితుడు అరెస్ట్
- కాల్పులకు గల కారణాలు వెల్లడించని అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఉత్తర జర్మనీలోని స్టాడే పట్టణంలో సోమవారం జరిగిన కాల్పుల్లో కనీసం ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుల వివరాలను కూడా అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఘటన ఎలా జరిగింది? దాడికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్‌ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్‌పింగ్‌కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
జర్మన్ వార్తా సంస్థ డీపీఏ (dpa) కథనం ప్రకారం.. సుమారు 50 వేల జనాభా కలిగిన స్టాడే పట్టణంలోని ఓ యూత్ సెంటర్ సమీపంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ పట్టణం హాంబర్గ్ నగరానికి పశ్చిమ దిశలో ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటనలో ఒకటి కంటే ఎక్కువ మంది నిందితులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ఘటన అనంతరం డాంకర్స్స్ట్రాసే పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఆ ప్రాంతానికి ప్రజలు వెళ్లొద్దని, అత్యవసర సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు హెచ్చరించారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ధృవీకరించినప్పటికీ.. మృతుల కచ్చిత సంఖ్య, నిందితుడి గుర్తింపు, బాధితుల వివరాలు వంటి అంశాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. ప్రస్తుతం అత్యవసర సిబ్బంది, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తుండగా.. కాల్పుల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అమెరికా కంటే జర్మనీలో తుపాకీ చట్టాలు కఠినంగా ఉంటాయి. సామూహిక కాల్పులు అరుదుగా జరుగుతాయి. ఎల్లప్పుడూ జరగవు. స్టేడ్ జనాభా సుమారు 50,000 మంది. ఇది హాంబర్గ్‌కు పశ్చిమాన ఉంది.
Another "new normal" day in "Modern Europe".
5 people dead after a shooting in the northern German town of Stade. pic.twitter.com/L2IuYabICh
— Tommy Robinson 🇬🇧 (@TRobinsonNewEra) June 29, 2026
తాజావార్తలు
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్‌ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్‌కు రిలీఫ్.. 10వ క్లాస్‌కు కొత్త రూల్ లేదు.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!