Site icon NTV Telugu

Trump Targets India: భారత్‌ను టార్గెట్ చేసిన అమెరికా.. సుంకాల విధింపులో జీ7 దేశాలను ఒప్పించిన ట్రంప్!

Trump

Trump

Trump Targets India: ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ను టార్గెట్ చేయడమే సరైన మార్గమని అగ్రరాజ్యం అమెరికా భావిస్తోంది. అందులో భాగంగానే మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఇండియా, చైనాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ఈయూ, జీ7 దేశాలు భారత్, చైనాలపై భారీగా టారిఫ్‌లు విధించాలని ట్రంప్‌ పాలకవర్గం ప్రతిపాదనలను పంపించింది. ఈ సుంకాల విధించడానికి తాజాగా జీ7 దేశాలు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.

Read Also: Begumpet: శ్మశానంలో వ్యభిచారం.. బేగంపేట పరిధిలో శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చిన మహిళ

కాగా, జీ7 దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం ( సెప్టెంబర్ 12న) నాడు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య సుంకాల విధింపుపై చర్చ కొనసాగినట్లు టాక్. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను యూఎస్ వాణిజ్య ప్రతినిధి జామిసన్‌ గ్రీర్‌ ఓ ప్రకటనలో తెలియజేశారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే.. మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు ఈయూ ముందుకు రావాలని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ పిలుపునిచ్చారు. అందుకు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న రెండు పొరుగు దేశాల (భారత్‌, చైనా)పై సుంకాలు విధించాలని డొనాల్డ్ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనల గురించి చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటికే.. భారత దిగుమతులపై యూఎస్ 50 శాతం సుంకాలు విధించింది.

Read Also: Hamas-Israel: ఖతార్‌లో పని చేయని ఇజ్రాయెల్ ఎత్తుగడ.. సజీవంగా హమాస్ నేతలు.. అసలేమైందంటే..!

అయితే, ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగింపుకి కట్టుబడి ఉన్నామంటూ జీ7 దేశాలు చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నట్లు అమెరికా తెలిపింది. దీంతో భారత్‌, చైనాలపై టారీఫ్స్ విధించేందుకు ఆయా దేశాలు రెడీ అయినట్లు సమాచారం.

Exit mobile version