Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Frank Hoogerbeets Predicts Turkey Syria Earthquakes 3 Days Before

Turkey Earthquake: మూడు రోజుల ముందే భూకంపాన్ని పసిగట్టాడు.. కానీ!

Published Date :February 7, 2023 , 8:12 am
By NTV WebDesk
Turkey Earthquake: మూడు రోజుల ముందే భూకంపాన్ని పసిగట్టాడు.. కానీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Frank Hoogerbeets Predicts Turkey Syria Earthquakes 3 Days Before: టర్కీ, సిరియాలను అతలాకుతలం చేసిన భారీ భూకంపాలను ఒక వ్యక్తి ముందుగానే పసిగట్టాడు. భూప్రకంప‌న‌లను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ స‌ర్వే (SSGEOS)కు చెందిన ఫ్రాంక్ హూగ‌ర్బీట్స్ అనే పరిశోధకుడు.. ద‌క్షిణ మ‌ధ్య ట‌ర్కీ, జోర్డాన్‌, సిరియా, లెబ‌నాన్ ప్రాంతాల్లో త్వరలోనే 7.5 తీవ్రతతో భూకంపం సంభవించవచ్చని ఫిబ్రవరి 3వ తేదీన ట్వీట్ చేశాడు. అయితే.. అప్పుడు అతడ్ని ఎవ్వరూ నమ్మలేదు. అతనో నకిలీ శాస్త్రివేత్త అంటూ నెటిజన్లు ధ్వజమెత్తారు. ఎందుకంటే.. గతంలో ఆయన వేసిన అంచనాలన్నీ బోల్తాపడ్డాయి. అందుకే.. ఇలాంటి తప్పుడు ట్వీట్లు వేయొద్దంటూ అతడ్ని మొదట్లో విమర్శించారు.

Vizag Capital: చకచకా విశాఖకు జగన్.. మార్చినుంచి అక్కడే మకాం

కానీ.. ఫ్రాంక్ చెప్పినట్టుగానే మూడు రోజుల తర్వాత టర్కీ, సిరియాలను భూకంపాలు కుదిపేశాయి. 7.8, 7.6, 6.0 తీవ్రతతో వరుసగా మూడు విధ్వంసకర భూకంపాలు ఆ రెండు ప్రాంతాల్ని చిదిమేశాయి. రెండు దేశాల్లో కలిపి 2800కు పైగా బిల్డింగులు నేలమట్టమయ్యాయి. 3400 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాదిమంది తీవ్ర గాయాలపాలయ్యాయి. భారీ ఆస్తినష్టం జరిగింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మొదటిసారి భూకంపం వచ్చినప్పుడు, మరోసారి భారీ భూకంపం తలెత్తే అవకాశం లేకపోలేదని SSGEOS పోస్ట్ చేసిన ట్వీట్‌ను ఫ్రాంక్ రీట్వీట్ చేశాడు. సరిగ్గా మూడు గంటల తర్వాత 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. తన అంచనా నిజం కావడంతో.. ఫ్రాంక్ విచారం వ్యక్తం చేశాడు. ఈ భూకంప వార్తలు తనని బాధించాయని పేర్కొన్నాడు. అయితే.. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఫ్రాంక్ అంచనాల్ని కొట్టిపారేస్తున్నారు. ఫ్రాంక్ అంచ‌నాలు అశాస్త్రీయమని, త‌ప్పుదారి ప‌ట్టించేలా ఉన్నాయని, అతని అంచనాలకు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిప‌దిక లేదని పేర్కొంటున్నారు.

Doomscrolling: ఈ వ్యసనం మీకుందా?.. ఈ చిట్కాలు పాటించండి

కాగా.. ట‌ర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంప విలయం కారణంగా 3400 మందికి పైగా మృతి చెందారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించడంతో, మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. ఊళ్లకు ఊళ్లు శిథిలాలుగా మారిపోయాయి. ఎందరో గాయాలపాలయ్యారు. ఈ భూకంపం వ‌ల్ల మ‌ర‌ణాల సంఖ్య దాదాపు ప‌ది వేల‌కు చేరే అవ‌కాశం ఉందని అమెరికాకు చెందిన జియోలాజిక‌ల్ స‌ర్వే అంచ‌నా వేసింది. ఈ శతాబ్దంలోనే దీనిని అతిభీకర భూకంపంగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాలకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. అటు.. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు.

Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV

— Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Earthquake
  • Frank Hoogerbeets
  • SSGEOS
  • Syria Earthquake
  • Turkey Earthquake

తాజావార్తలు

  • MLC Anantha Babu Wife: 6 గంటల పాటు సాగిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మి దుర్గ విచారణ.. రేపు మళ్లీ రావాలని ఆదేశాలు..

  • Bengal Elections: మరోసారి మమతా వర్సెస్ సువేందు.. బీజేపీ తొలి జాబితా విడుదల..

  • Gold Rates Down: భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం..

  • Gas Cylinder: ఒక ఇంట్లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉండాలి..? ఈ నిబంధనలు తెలియకపోతే జైలుకే..

  • Shivalik LGP Tanker: గుజరాత్ చేరుకున్న ఎల్‌పీజీ ట్యాంకర్.. తీరనున్న గ్యాస్ కష్టాలు

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions