Bangladesh MP Murder: సెప్టిప్ ట్యాంకులో బంగ్లాదేశ్ ఎంపీ మాంసం.. ఫోరెన్సిక్ విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh MP Murder: బంగ్లాదేశ్ అధికారి పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ కోల్‌కతాలో హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. వైద్య చికిత్స కోసం మే 12 వచ్చిన అతను మే 14 నుంచి కనిపించకుండా పోయారు. తాజాగా ఎక్కడైతే అతను హత్యకు గురయ్యాడని భావిస్తున్నారో, ఆ అపార్ట్‌మెంట్‌లోని సెప్టిప్ ట్యాంక్‌లో మూడున్నర కిలోల మాంసం లభించింది. అన్వరుల్ హసన్‌ని హత్య చేసి, అతని చర్మాన్ని ఒలిచి, ముక్కలుగా నరికి ప్యాక్ చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Israel Strike On Rafah: రఫా దాడిలో 21 మంది మృతి.. తమ పని కాదన్న ఇజ్రాయిల్..
Also Read
- Vladimir Putin: "భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
సెప్టిక్ ట్యాంక్‌లో లభించిన మాంసం మానవుడిదా, అన్వరుల్ శరీర భాగమేనా అని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ విచారణ చేపట్టినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎంపీకి సంబంధించిన శరీర భాగాల జాడ కనుగొనబడలేదు. బంగ్లాదేశ్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ చీఫ్ హరున్-ఉర్-రషీద్ దీనిని “కోల్డ్ బ్లడెడ్, అనాగరిక హత్య”గా అభివర్ణించారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారు. అన్వరుల్‌ని హత్య చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్‌కి చెందిన అక్రమ వలసదారుగా గుర్తించారు, కసాయి వృత్తి చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ కేసులో అతడిని విచారిస్తున్నారు. మిగిలిన శరీర భాగాలను కనుగొనేందుకు మురుగు నీటి పైప్ లైన్‌ని పరిశీలించామని, దీనికి పశ్చిమ బెంగాల్ సీఐడీ సహాయం తీసుకున్నామని రషీద్ చెప్పారు.
ఎంపీకి స్నేహితుడైన అక్తరుజ్జమాన్ అనే అమెరికా సిటిజన్ ఈ హత్య చేయించినట్లు తెలుస్తోంది. అక్తరుజ్జమాన్ దీని కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేశాడని, ఇందులో కొంత భాగాన్ని తనకు ఇచ్చినట్లు హత్య చేసిన కసాయి వృత్తిలో ఉన్న జిహాద్ హవ్లాదార్ ఒప్పుకున్నాడు. కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో తాను, మరో నలుగురు కలిసి బంగ్లాదేశ్ ఎంపీని హతమార్చినట్లు హవ్లాదార్ ఒప్పుకున్నాడు. అక్తరుజ్జమాన్ ఆదేశాల మేరకే హత్య జరిగిందని వెల్లడించారు. బంగ్లాదేశ్ అధికార షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ ఎంపీగా ఉన్న అన్వురల్ అజీమ్ అన్వర్ మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!