ఐదుగురు ఐక్యరాజ్యసమితికి చెందిని సిబ్బందిని కిడ్నాప్‌కు గురయ్యారు.. శుక్రవారం దక్షిణ యెమెన్‌లో ఐదుగురు సిబ్బందిని కిడ్నాప్ చేశారని తెలిపారు యూఎస్ అధికార ప్రతినిధి రస్సెల్ గీకీ.. ఓ మిషన్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్‌లో పనిచేస్తున్నారని… ఈ క్రమంలో పనిముగించుకుని అడెన్‌కు తిరిగి వస్తుండగా దుండగులు వారిని కిడ్నాప్ చేశారని తెలిపారు.. వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్‌లో ఐరాసా అధికారి రస్సెల్ గీకీ పేర్కొన్నారు.. కాగా, సౌదీ నేతృత్వంలోని మిలటరీ సంకీర్ణం 2015 నుండి యెమెన్‌లో ఇరాన్-అలైన్డ్ హౌతీ గ్రూపుతో పోరాడుతోంది. 2015లో హౌతీలు రాజధాని సనా నుంచి ప్రభుత్వాన్ని బహిష్కరించిన తర్వాత యెమెన్ అంతర్యుద్ధంలో సంకీర్ణం జోక్యం చేసుకుంది. ఈ సంఘర్షణలో ఇప్పటికే 10 వేల మంది చనిపోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో, యెమెన్‌లో సంక్షోభం ఏర్పడింది.
Read Also: Selvam: మాజీ ఎమ్మెల్యేకు సెగ.. మళ్లీ సొంత గూటికి..