Facebook, Instagram, WhatsApp Down For Thousands Of Users In US: అమెరికాలో మెటాకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రమ్, వాట్సాప్ డౌన్ అయ్యాయి. దీంతో వేలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం మెటా సోషల్ ఫ్లాట్‌ఫామ్స్ డౌన్ అయినట్లు ‘డౌన్‌డిటెక్టర్.కామ్’ వెల్లడించింది. 18,000 మంది ఇన్ స్టా యూజర్లు తాము లాగిన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. 13,000 మంది ఫేస్ బుక్ యాప్ యాక్సెస్ లో సమస్యలు ఉన్నట్లు నివేదించారు. వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్లకు కూడా అంతరాయం ఏర్పడినట్లు డౌన్‌డిటెక్టర్.కామ్ వెల్లడించింది.
Read Also: Republic Day: రిపబ్లిక్ వేడుకలకు అంతా సిద్ధం.. ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు
ఇటీవల కాలంలో పలు దేశాల్లో సోషల్ మీడియా యాప్స్ డౌన్ అయ్యాయి. ఇండియాలో కూడా గతంలో వాట్సాప్ డౌన్ కావడం చూశాం. గూగుల్, మైక్రోసాఫ్ట్ తో సహా అనేక కంపెనీల సేవలకు అంతరాయం ఏర్పడటం సాధారణం అయిపోయింది. మైక్రోసాఫ్ట్ నెట్ వర్కింగ్ లో బుధవారం అంతరాయం ఏర్పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలయన్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపించింది.