NTV Telugu Site icon

US F-15 Fighter Jets: మిడిల్‌ ఈస్ట్‌కు అమెరికా ఫైటర్‌ జెట్‌ విమానాలు..!

Us

Us

US F-15 Fighter Jets: పశ్చిమాసియాలో ఉద్రిక్త నేపథ్యంలో అమెరికా మోహరింపులు వేగవంతమయ్యాయి. తాజాగా ఎఫ్‌-15 ఫైటర్‌జెట్‌లను అక్కడికి తరలించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ఇరాన్‌ దుందుడుకు చర్యలను కట్టడి చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ఈ రోజు (శుక్రవారం) అమెరికా వాయుసేన 492వ ఫైటింగ్‌ స్క్వాడ్రన్‌కు చెందిన ఎఫ్‌-15 స్ట్రైక్‌ ఈగిల్స్‌ను మిడిల్‌ ఈస్ట్‌కు తరలించామని వెల్లడించారు. ఇవి ఇప్పటికే అక్కడి సెంట్రల్‌ కమాండ్‌కు చేరుకొన్నాయని ఆ దేశ సైన్యం సోషల్‌ మీడియాలో తెలిపింది. ఇప్పటికే అమెరికా బీ-52 బాంబర్లు కూడా గల్ఫ్‌లోని సైనిక స్థావరాలకు చేరిపోయాయని చెప్పుకొచ్చారు. వీటికి అండగా ట్యాంకర్‌ విమానాలు, బాలిస్టిక్‌ క్షిపణులు, డెస్ట్రాయర్స్‌ను తరలించామని యూఎస్ వెల్లడించింది.

Read Also: Varun Dhawan: సిటడెల్‌లో సెమీ న్యూడ్‌ సీన్‌.. నెటిజన్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరో!

కాగా, అంతకు ముందే థాడ్‌ గగనతల రక్షణ వ్యవస్థను కూడా అక్కడ మోహరించింది. ఇరాన్‌, దాని రహస్య ముఠాలు అమెరికా మిలటరీ లేదా ప్రయోజనాలను దెబ్బ తీయాలని ట్రై చేస్తే అడ్డుకొని మా వారిని రక్షించుకోవడానికే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇటీవల వాషింగ్టన్‌ వార్నింగ్ జారీ చేసింది. ఇరాన్‌ అతి త్వరలో తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ సంస్థలు నివేదికలు ఇచ్చింది. ఇరాక్‌ వైపు నుంచి జరగొచ్చని సమాచారం అందించింది. దీంతో అలర్టైన అమెరికా ఇరాక్‌ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు జరిగిన తర్వాత ఎదురైయ్యే పరిణామాలను బాగ్దాద్‌ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆరోపణలను మాత్రం ఇరాక్‌ తప్పుబట్టింది. అక్టోబర్‌ 1న ఇరాన్‌ దాదాపు 200 బాలిస్టిక్‌ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఇరాన్‌ ఇప్పుడు ఏమైనా దుందుడుకు చర్యలు చేపడితే.. అమెరికా స్పందన ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.

Show comments