Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- భార్య అక్రమ సంబంధాన్ని పట్టుకునేందుకు భర్త స్కెచ్
- రోబో వాక్యూమ్ కెమెరాతో ప్రణాళిక
- కోర్టులో ఆధారాలు సమర్పించడంతో భార్య షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ భర్త టెక్నాలజీని ఉపయోగించి భార్య అక్రమ సంబంధాన్ని పట్టుకున్నాడు. మూడో కంటికి తెలియకుండా చాలా చాకచక్యంగా వీడియో రికార్డ్ చేశాడు. కానీ చివరికి అదే అతడికి శాపంగా మారుతుందని ఊహించలేకపోయాడు. ఇంతకీ భార్య అక్రమ సంబంధాన్ని ఎలా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది. తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
తైవాన్‌లో చోటుచేసుకున్న ఓ విడాకుల కేసు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని రుజువు చేసేందుకు ఓ భర్త తన ఇంట్లోని రోబో వాక్యూమ్ కెమెరా రికార్డింగ్స్‌ను ఆధారంగా ఉపయోగించాడు. ఆ వీడియోల ఆధారంగా భార్య, ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నాడు. ఈ కేసులో కోర్టు భర్తకు మానసిక వేదనకు పరిహారంగా 5 లక్షల తైవాన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.17 లక్షలకు సమానం.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
అయితే ఈ కేసులో భర్తకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తన అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రదేశంలో వీడియో రికార్డు చేశాడంటూ భార్య అతడిపై మరో కేసు వేసింది. ఈ కేసును విచారించిన కోర్టు.. ఆమె వాదనతో ఏకీభవించింది. అనుమతి లేకుండా భార్యను చిత్రీకరించడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంటూ భర్తకు ఐదు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 1.5 లక్షల తైవాన్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
రోబో వాక్యూమ్‌తో..
భర్త తన రోబో వాక్యూమ్కు సంబంధించిన మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో ఉన్న భార్యను రిమోట్‌గా సంప్రదించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాక్యూమ్లోని కెమెరా ద్వారా లైవ్ ఫుటేజీ అతడికి కనిపించింది. అందులో భార్య దుస్తులు మార్చుకోవడం, ఒక వ్యక్తితో బెడ్‌పైకి వెళ్లడం, ఇంట్లో కలిసి తిరుగుతున్న దృశ్యాలు కనిపించినట్లు సమాచారం. దీంతో భర్త ఆ దృశ్యాలను రికార్డు చేసి భద్రపరిచాడు. అనంతరం విడాకుల కేసులో భార్య వివాహేతర సంబంధానికి ఆధారంగా ఆ వీడియోలను కోర్టులో సమర్పించాడు. ఆ ఆధారాలతో అతడి వాదనకు బలం చేకూరడంతో మానసిక వేదనకు పరిహారం పొందాడు.
అయితే అదే వీడియో రికార్డింగ్ అతడికి శాపంగా మారింది. తన అనుమతి లేకుండా ప్రైవేట్ సందర్భాలను చిత్రీకరించాడంటూ భార్య ఫిర్యాదు చేయడంతో కోర్టు మరో కోణంలో కేసును పరిశీలించింది. చివరకు రోబో వాక్యూమ్ కెమెరాను ఉపయోగించిన విధానం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిందని నిర్ధారించి జైలు శిక్ష విధించింది.
స్మార్ట్ పరికరాలతో గోప్యతకు ముప్పు?
ఈ ఘటనతో ఇంట్లో ఉపయోగించే స్మార్ట్ పరికరాల భద్రత, గోప్యతపై మరోసారి చర్చ మొదలైంది. ఆధునిక రోబో వాక్యూమ్ క్లీనర్లు కేవలం నేలను శుభ్రం చేయడానికే పరిమితం కావు. వాటిలో కెమెరాలు, వివిధ రకాల సెన్సర్లు ఉండటంతో ఇళ్లలోని గదులను మ్యాప్ చేయడం, వస్తువులను గుర్తించడం, స్వయంచాలకంగా మార్గాన్ని నిర్ణయించుకోవడం వంటి పనులు చేస్తాయి. పరికరం, దాని సాఫ్ట్‌వేర్‌ను బట్టి సేకరించే సమాచారం ఇంటి నిర్మాణం, గదుల అమరిక, ఇంట్లో జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతో స్మార్ట్ హోమ్ పరికరాలు సౌకర్యంతో పాటు గోప్యతకు సంబంధించిన ప్రమాదాలను కూడా తీసుకురావచ్చనే విషయం ఈ ఘటనతో స్పష్టమైంది. నేలను శుభ్రం చేయడానికి రూపొందించిన ఓ రోబో వాక్యూమ్.. అనుకోకుండా నిఘా సాధనంగా మారిన ఈ ఘటన సాంకేతిక పరికరాలను ఉపయోగించేటప్పుడు వ్యక్తిగత గోప్యత, అనుమతులు, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!