2023 Israel–Hamas war: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కారుచిచ్చు రగులుతుంది. ఇప్పటికే ఇరు దేశాలు విచక్షణ రహితంగా ఒకరి మీద ఒక్కరు విరుచుకు పడుతున్నారు. ఈ మారణహోమంలో వేలమంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇలాంటి సమయంలో ఇతర దేశాలు మద్దతు ఇస్తూ యుద్ధంలో పాల్గొనడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త. వివరాలలోకి వెళ్తే.. ఓ అంతర్జాతీయ మీడియాతో ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త మరియు యురేషియా గ్రూప్ వ్యవస్థాపకుడు ఇయాన్ బ్రెమ్మర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇజ్రాయెల్ మరియు గాజా మధ్య భూమి యుద్ధం జరుగుతుంది . ఈ నేపథ్యంలో ఇరాన్ నేరుగా పోరాటంలో పాల్గొంటే యుద్ధం తార స్థాయికి చేరుతుందని తెలిపారు.
Read also:Trivikram: త్రివిక్రమ్ కొడుకు ను చూశారా.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ.. కానీ?
దీనికి కారణం ఇరాన్ దగ్గర సైనిక సామర్ధ్యం అధికంగా ఉంది అలానే ఇరాన్ యుద్ధంలో పాల్గొంటే ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా నేరుగా పోరాటంలో పాల్గొనే అవకాశం ఉందని.. అదే జరిగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇలా ఇరాన్ ఈ యుద్ధంలో పాల్గొనడం వల్ల యుద్దానికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. ఇది చాలా కారణాల వల్ల చెడ్డ ఆలోచన. ఇజ్రాయిల్ పాలస్తీనియన్ పౌరులను దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపుతుంది. ఇలానే జరిగితే పాలస్తీనియన్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసే సమయం కూడా ఉండదు. ఇది చుట్టుపక్కల ప్రాంతాల పైన కూడా ప్రభావాన్ని చూపుతుందని అయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ప్రాంతీయంగా విస్తరించాలని భావిస్తున్నారా అని మీడియా ప్రతినిధి అడగగా.. ఇది ప్రపంచ యుద్ధం 3 కాదని పేర్కొన్నారు.