Europe Heatwave: యూరప్‌ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- యూరప్‌ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’
- మేఘాలు ఏర్పడవు.. వర్షాలు కురవవు
- పలు దేశాల్లో రెడ్ అలర్ట్‌లు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూరప్ దేశాలను గత కొద్ది రోజులుగా తీవ్ర హీట్‌వేవ్ అతలాకుతలం చేస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్, రొమేనియా సహా పలు దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసర సేవలపై కూడా తీవ్ర ఒత్తిడి పెరగగా.. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. స్విట్జర్లాండ్‌లో అణు విద్యుత్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. పలు దేశాల్లో రెడ్ అలర్ట్‌లు జారీ చేశారు. ఇక ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. తీవ్ర వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇంకోవైపు ఏసీల కోసం దుకాణాల దగ్గర ప్రజలు క్యూ కడుతున్నారు. అంతగా అల్లాడిపోతున్నారు.

Also Read
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
- Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
- Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
- Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ అసాధారణ వేడిగాలులకు ప్రధాన కారణం ‘ఒమేగా బ్లాక్’ (Omega Block) అనే అరుదైన వాతావరణ పరిస్థితి. దీనికి మానవ చర్యల వల్ల వేగంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు కూడా తోడవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
ఒమేగా బ్లాక్ అంటే ఏమిటి?
ఒమేగా బ్లాక్ అనేది గ్రీకు అక్షరం Ω (ఒమేగా) ఆకారంలో ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితి. రెండు అల్పపీడన వ్యవస్థల మధ్య ఒక బలమైన అధిక పీడన వ్యవస్థ చిక్కుకుపోయినప్పుడు ఇది ఏర్పడుతుంది. సాధారణంగా పశ్చిమం నుంచి తూర్పు దిశగా వీచే జెట్ స్ట్రీమ్ గాలుల ప్రవాహం ఈ అధిక పీడన వ్యవస్థ కారణంగా అడ్డంకి ఎదుర్కొంటుంది. దీంతో ఒకే ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు రోజులు, కొన్ని సందర్భాల్లో వారాల పాటు మారకుండా కొనసాగుతాయి. ఈ పరిస్థితి కారణంగా అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వచ్చే చల్లటి గాలులు యూరప్‌లోకి ప్రవేశించలేవు. అలాగే అధిక పీడన ప్రభావంతో మేఘాలు ఏర్పడవు.. వర్షాలు కురవవు. ఫలితంగా ఎండ నేరుగా భూమిపై పడుతూ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతాయి.
ఈ హీట్‌వేవ్ కారణంగా యూరప్‌లోని అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జర్మనీలో చరిత్రలోనే అత్యధికంగా 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. యూకే, స్విట్జర్లాండ్లలో జూన్ నెలలో ఎప్పుడూ లేనంత వేడి నమోదైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అత్యవసర సేవలకు వచ్చే కాల్స్ గత ఏడాదితో పోలిస్తే 80 శాతం పెరిగాయి. మార్సెల్ నగరంలో కారులో వదిలిపెట్టిన ఓ చిన్నారి వేడి కారణంగా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. స్విట్జర్లాండ్‌లోని బెజ్నౌ అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని ఆరే నది నీరు అధికంగా వేడెక్కడంతో రియాక్టర్లను చల్లబరచడం సాధ్యం కాక.. రెండు రియాక్టర్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక రొమేనియా దేశవ్యాప్తంగా రెడ్ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ తీవ్ర వేడి ఇప్పుడు తూర్పు యూరప్, బాల్కన్ దేశాల వైపు కదులుతోందని.. అక్కడ 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూరప్‌లో రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింది. బెల్జియంలో యూరోస్టార్ రైళ్లు సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంతో.. ఎయిర్ కండీషనింగ్ పనిచేయక వందలాది మంది ప్రయాణికులను ఖాళీ చేయాల్సి వచ్చింది. జర్మనీలో అధిక వేడి కారణంగా జాతీయ రహదారుల కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌లు అధిక వేడితో విస్తరించడంతో ఆలస్యాలు సంభవించే అవకాశం ఉందని యూరప్‌లోని రైల్వే సంస్థలు హెచ్చరించాయి. నెదర్లాండ్స్‌లోని డెఫ్కాన్.1 మ్యూజిక్ ఫెస్టివల్, బెల్జియంలోని బాటిల్ ఆఫ్ వాటర్లూ పునర్నిర్మాణ కార్యక్రమం వంటి పలు బహిరంగ ఈవెంట్లను కూడా రద్దు చేశారు.
ప్రపంచ వాతావరణ మార్పుల వల్ల ఈసారి హీట్‌వేవ్ మరింత తీవ్రరూపం దాల్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ (WWA) సంస్థ ప్రకారం.. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల వల్ల ఏర్పడిన గ్లోబల్ వార్మింగ్ లేకపోతే ప్రస్తుతం యూరప్‌లో కనిపిస్తున్న ఈ స్థాయి హీట్‌వేవ్ సంభవించడం దాదాపు అసాధ్యమని పేర్కొంది. పారిశ్రామిక విప్లవానికి ముందు కాలంతో పోలిస్తే భూమి ఉష్ణోగ్రత ఇప్పటికే 1.4 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. ఒమేగా బ్లాక్‌ల సంఖ్య పెరుగుతుందా అనే అంశంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ.. పెరుగుతున్న గ్లోబల్ ఉష్ణోగ్రతలు హీట్‌వేవ్‌లను మరింత తీవ్రంగా, ఎక్కువ కాలం కొనసాగేలా చేస్తున్నాయనే విషయంలో శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయంతో ఉన్నారు.
రాబోయే రోజుల్లో పశ్చిమ యూరప్‌లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. ఒమేగా బ్లాక్ తూర్పు దిశగా కదులుతున్నందున మధ్య యూరప్, బాల్కన్ ప్రాంతాల్లో వచ్చే వారం మరింత తీవ్రమైన వేడి నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఉష్ణోగ్రతలు తగ్గినా.. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై హీట్‌వేవ్ ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Europe Heatwave: యూరప్‌ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..