NTV Telugu Site icon

Emirates flights: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం.. పేజర్ల, వాకీటాకీలపై నిషేధం

Emiratesflights

Emiratesflights

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై పేజర్లు, వాకీటాకీలపై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. దుబాయ్‌లో ప్రయాణికుల దగ్గర దొరకడంతో పోలీసులు వాటిని జప్తు చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ రెండింటీపై నిషేధం విధించినట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ నిబంధనలు అంతర్జాతీయ ప్రయాణికులందరికీ వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Kondagattu Anjanna: టీటీడీ శుభవార్త.. నెరవేరనున్న కొండగట్టు అంజన్న భక్తుల కల..

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కారణంగా ఇరాక్, ఇరాన్, జోర్డాన్ వచ్చే అన్ని సాధారణ విమాన సర్వీసులను నిలిపివేసింది. ప్రస్తుతం మళ్లీ సర్వీసులను నెమ్మదిగా పునరుద్ధరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మరియు లెబనాన్ మధ్య మాత్రం సర్వీసులు నడవడం లేదు. ఇదిలా ఉంటే ప్రయాణికుల వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రయాణానికి అనుమతి ఇస్తామని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

ఇది కూడా చదవండి: ఒక్క ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోని క్రికెటర్లు వీళ్లే..

గత నెలలో లెబనాన్‌లో ఉన్నట్టుండి పేజర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో వందలాది మంది చనిపోగా.. వేలాది మంది గాయపడ్డారు. ఇక మరుసటి రోజే వాకీటాకీలు కూడా పేలిపోయాయి. ఈ ఘటనలో కూడా పలువురు ప్రాణాలు వదిలారు. దీంతో పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే ఈ రెండింటీపై పలు దేశాలు నిషేధం విధించాయి. వాటిని ఉపయోగించొద్దని ఆదేశాలు ఇచ్చాయి. అయితే వీటిని ఇజ్రాయెలే పేల్చిందని ఆరోపించాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా స్పందించలేదు. అనంతరం హిజ్బుల్లా అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ హతం చేసిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై 180 క్షిపణులను ప్రయోగించింది. కానీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

ఇది కూడా చదవండి: అత్యధికంగా టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన మహిళ ఆటగాళ్లు వీళ్లే

Show comments