Elon Musk’s Twitter poll shows users want him to step down: భారీ డీల్‌తో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్‌ని సొంతం చేసుకున్నాడు అపరకుబేరుడు ఎలాన్ మస్క్. అప్పటి నుంచి వరసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు నెల వారీగా డబ్బులు కట్టాలనే పాలసీని తీసుకువచ్చాడు. ట్విట్టర్ సొంత చేసుకున్న గంటల్లోనే సీఈఓతో సహా పలువురు ముఖ్యమైన ఉద్యోగులను తీసేశాడు. దీంతో పాటు కంపెనీలో పనిచేస్తున్న 7500 మందిలో సగం మందిని తీసేశాడు.
Read Also: Moonlighting: “మూన్‌లైటింగ్”పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. టెక్కీలకు షాక్..
ఇదిలా ఉంటే యూజర్ల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఇటీవల ట్విట్టర్ లో పోల్ పెడుతున్నాడు ఎలాన్ మస్క్. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని తిరిగి ట్విట్టర్ లోకి తీసుకోవాలా..? వద్దా..? అనేదానిపై పోల్ నిర్వహించాడు. దీంట్లో మెజారిటీ యూజర్లు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించాలని ఓట్ వేశారు. ఆ తరువాత ఇటీవల రష్యా-ఉక్రెయిన్ వార్ పై ఓ పోల్ నిర్వహించాడు. అయితే ఈ పోల్ వివాదాస్పదం అయింది. ఉక్రెయిన్ దీనిపై తీవ్రంగా స్పందించింది.
తాజాగా తాను ట్విట్టర్ సీఈఓగా ఉండటంపై పోల్ నిర్వహించాడు. అయితే మెజారిటీ యూజర్లు ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చారు. సోమవారం నిర్వహించిన ఈ పోల్ లో యూజర్లు దిమ్మతిరిగే నిర్ణయాన్ని తెలిపారు. మొత్తం 17 మిలియన్ల యూజర్లు, 57.5 శాతం మంది సీఓఓగా ఎలాన్ మస్క్ వైదొలగాలని ఓటు వేశారు. అయితే దీనిపై ఎలాన్ మస్క్ ఇంకా స్పందించలేదు.