NTV Telugu Site icon

Elon Musk: ట్రంప్ ప్రమాణస్వీకారంలో ఎలాన్ మస్క్ అత్యుత్సాహం.. వివాదానికి దారితీసిన ‘నాజీ సెల్యూట్’

Elon

Elon

Elon Musk: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ ​ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కడికి వచ్చిన ప్రముఖులు, పార్టీ నేతల్లో అతడు జోష్‌ నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ వన్ అరేనాలో వేదికపైన మస్క్ మాట్లాడుతూ.. బ్యాక్ టు బ్యాక్ నాజీ సెల్యూట్‌ చేయడంతో వివాదానికి దారి తీసింది. ఇక, డొనాల్డ్ ట్రంప్ విజయం సాధారణమైనది కాదు.. ఇది మానవ నాగరికతకు ఒక చీలిక లాంటిదన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. అమెరికా భవిష్యత్తుకు భరోసా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని ట్రంప్ కు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కృతజ్ఞతలు తెలిపాడు.

Read Also: KiranRahay : తండ్రి కాబోతున్న యంగ్ హీరో.. ఫోటో రిలీజ్

ఇక, ఈ వీడియోను తన ఎక్స్ అకౌంట్లో ఎలాన్ మస్క్ పోస్ట్ చేశాడు. భవిష్యత్తు చాలా ఉత్తేజకరమైనది అంటూ రాసుకొచ్చాడు. అయితే అతను రీట్వీట్ చేసిన వీడియోలో నాజీ సెల్యూట్‌ చేయడం కనిపించలేదు. ఇక, సోషల్ మీడియా వేదికగా కొందరు యూజర్లు అమెరికాకు ఎన్నుకోబడని ప్రెసిడెంట్ ఎలోన్ మస్క్ నాజీ సీగ్ హీల్ సెల్యూట్ చేసాడు అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన స్పేస్ ఎక్స్ సంస్థ.. మీడియా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తోంది.. ఎలోన్ మస్క్ ఎప్పుడూ నాజీ సెల్యూట్ చేయలేదు అని వెల్లడించింది.