టెస్లా సీఈఓ, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్(76) సంచలన విషయాన్ని వెల్లడించారు. మూడేళ్ల క్రితం సవతి కుమార్తె 35 ఏళ్ల జానా బెజుడెన్ హౌట్ తో రహస్యంగా రెండో బిడ్డకు జన్మనిచ్చానని తెలిపాడు. బ్రిటీష్ టాబ్లాయిడ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఎర్రోల్ మస్క్ వెల్లడించారు. 2019లో ఎర్రోల్ మస్క్, ఎలాన్ మస్క్ సవతి సోదరి జానాతో కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. దీనికి అతను ఓ అసహ్యకరమైన సమర్థింపును కూడా తెలిపాడు. ‘‘ మనం భూమిపై ఉన్నది పునరుత్పత్తి కోసమే’’ అంటూ సమర్థించుకున్నాడు.
Read Also: Godavari Floods: డేంజర్ లెవల్.. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక..
జానా బెజుడెన్‌హౌట్ ఎర్రోల్ మస్క్ రెండవ భార్య హీడే బెజుడెన్‌హౌట్ కుమార్తె. 1979లో ఎలాన్ మస్క్ తల్లి మేయే హాల్డెమాన్ మస్క్ తో విడిపోయిన తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. ఎర్రోల్, హీడ్ లు అప్పటికే పిల్లుల కలిగి ఉన్నారు. ఎర్రోల్ జానా బెజుడెన్‌హౌట్ కు సవతి తండ్రి. రెండో వివాహం జరిగిన తర్వాత 18 ఏళ్లకు ఎర్రోల్, హీడ్ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత సవతి కూతురుతోనే అనైతిక సంబంధాన్ని పెట్టుకున్నాడు ఎలాన్ మస్క్ తండ్రి. 2017లోనే ఎర్రోల్, జానా మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ సమయంలో ఎర్రోల్ కారణంగా జానా గర్భం దాల్చడం ఎలాన్ మస్క్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎలాన్ మస్క్, అతని తండ్రి మధ్య తీవ్ర వాగ్వాదానికి కారనం అయింది. ఈ విషయం వాళ్లకు కొంత గగుర్పాటుగా అనిపించిందిన.. ఎందుకంటే జానా, ఎలాన్ మస్క్ సవతి సోదరి అని ఇంటర్య్వూలో ఎర్రోల్ మస్క్ వెల్లడించారు. ఎలాన్ మస్క్ తో కలిపి అతని తండ్రి ఎర్రోల్ మస్క్ కు మొత్తం ఏడుగురు పిల్లలు ఉన్నారు.