Site icon NTV Telugu

Elon Musk: ట్రంప్ విందుపై స్పందించిన ఎలాన్ మస్క్

Elon Musk

Elon Musk

వైట్‌హౌస్ వేదికగా గురువారం ట్రంప్ టెక్ సీఈవోలందరికీ ప్రత్యేక విందు ఇచ్చారు. దిగ్గజ సీఈవోలందరూ విందుకు హాజరయ్యారు. కానీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హాజరుకాకపోవడంపై అంతర్జాతీయంగా వార్త చక్కర్లు కొట్టింది. ఎలాన్ మస్క్‌ను ట్రంప్ ఆహ్వానించలేదంటూ మీడియాలో.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ ప్రచారంపై ఎలాన్ మస్క్ స్పందించారు.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!

వైట్‌హౌస్ విందుకు తనను కూడా ట్రంప్ ఆహ్వానించారని ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. విందుకు ఆహ్వానించలేదంటూ వస్తున్న వార్తలను మస్క్ ఖండించారు. బిల్‌గేట్స్‌ను ఆహ్వానించారు కానీ.. ఎలాన్‌ మస్క్‌ను పిలవలేదంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు మస్క్‌ బదులిచ్చారు. ‘నాకు ఆహ్వానం అందింది. కానీ దురదృష్టవశాత్తు హాజరు కాలేకపోయాను. నా ప్రతినిధి అక్కడ ఉన్నారు’ అని స్పష్టం చేశారు. విందులో మాత్రం మస్క్‌ ప్రత్యర్థి.. ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ మాత్రం పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Congress vs BJP: బీహార్, బీడీలు ‘బీ’తోనే ప్రారంభమవుతాయి.. కాంగ్రెస్ పోస్ట్‌‌పై తీవ్ర దుమారం

2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ వెంటే మస్క్ కనిపించారు. ఎక్కడకెళ్లినా మస్క్ ఉండేవారు. ఇక ట్రంప్ అధ్యక్ష పీఠంపై కూర్చున్న తర్వాత కూడా ఓవర్ కార్యాలయంలోనే కొడుకును భుజంపై ఎక్కించుకుని కనిపిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే డోజ్ శాఖ బాధ్యతలు మస్క్‌కు అప్పగించారు. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. అనంతరం విమర్శలపై క్షమాపణలు కూడా చెప్పారు. ఇక బిల్లు ఆమోదం పొందగానే కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. తాజాగా ట్రంప్ ఇచ్చిన విందులో మస్క్ కనిపించకపోవడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.

Exit mobile version