Elon Musk: “నాపై రెండుసార్లు హత్యాయత్నం”.. ట్రంప్ హత్యాయత్నం నేపథ్యంలో మస్క్ సంచలన ఆరోపణలు..
- ట్రంప్ హత్యాయత్నం తర్వాత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..
- తనపై కూడా రెండు సార్లు హత్యాయత్నం చేశారన్న మస్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్‌లోని టెస్లా ప్రధాన కార్యాలయం సమీపంలో తుపాకులతో అరెస్టైన వ్యక్తుల సంఘటనను, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత మస్క్ భద్రతపై ఎక్స్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన తర్వాత మస్క్ ఎక్స్ వేదికగా ‘‘తనపై గత 8 నెలల్లో రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయని’’ వెల్లడించారు.
Read Also: Home Minister Anitha: యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ని పరామర్శించిన హోం మంత్రి
Also Read
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
మస్క్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఓ ఎక్స్ యూజర్ ‘‘ దయచేసి, మీ రక్షణ మూడు రెట్లు పెంచుకోంది. వారు ట్రంప్ కోసం రాగలిగితే, మీ కోసం కూడా వస్తారు’’ అని వ్యాఖ్యానించారు. దీనికి రిప్లైగా తనపై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నం జరిగిందని అన్నారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. నిందితుడు కాల్పులు జరిపిన సమయంలో బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది. దీంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనలో ట్రంప్ మద్దతుదారుల్లో ఒకరు మరణించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు నిందితుడిని కాల్చి చంపారు.
2022లో కూడా మస్క్ తాను హత్యకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత ఎలాన్ మస్క్ తన మద్దతును రిపబ్లికన్‌లకు ప్రకటించారు. తాను ట్రంప్‌కి పూర్తి మద్దతు తెలియజేస్తున్నానని చెప్పారు. అతను త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. ఈ ఘటనను అత్యంత అసమర్థ ఘటనగా అభివర్ణించారు. దీనికి బాధ్యతగా సీక్రెట్ సర్వీస్ అధిపతి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!