Musk: ట్రంప్‌తో గొడవపై మస్క్ క్షమాపణ.. పోస్టులపై విచారం
- ట్రంప్‌తో గొడవపై మస్క్ క్షమాపణ
- పోస్టులపై విచారం వ్యక్తం చేసిన మస్క్
- ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వెంటే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నడిచారు. అన్నీ తానై నడిపించాడు. ట్రంప్ ఎక్కడికెళ్లినా మస్క్ తప్పనిసరిగా ప్రచారంలో పాల్గొనేవారు. అలా పాలు.. నీళ్ల కలిసిపోయారు. అధికారం కూడా చేజిక్కింది. ఎప్పుడూ ట్రంప్ వెంటే కనిపించారు. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తూ ఉండేవారు. తాజాగా ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా మస్క్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వాటిన్నింటినీ వైట్‌హౌస్ ఖండిస్తూ వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య స్నేహం చెడిందని ప్రపంచ మీడియా కూసింది. అంతేకాకుండా మస్క్‌కు చెందిన కంపెనీలు మార్కెట్లో భారీ పతనాన్ని చూశాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్, జేడీవాన్స్, మస్క్‌ను చంపేస్తాం.. అల్‌ఖైదా హెచ్చరిక
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
తాజాగా ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు. ట్రంప్‌పై పెట్టిన పోస్టులపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిపై తాను పెట్టిన పోస్టులు చాలా దూరం వెళ్లాయని.. ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మస్క్ తాజాగా ట్వీట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: MP Balram Naik: కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలే.. ఎంపీ ఘాటు వ్యాఖ్యలు..!
ట్రంప్ పరిపాలన తీసుకొచ్చిన బిగ్ బ్యూటీఫుల్ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లుతో దేశం దివాలా తీయడం ఖాయమని.. అమెరికన్లు ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిని చేయాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వైట్‌హౌస్ అప్రమత్తం అయింది. మొత్తానికి ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ మస్క్ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.
I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.
— Elon Musk (@elonmusk) June 11, 2025
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!