Site icon NTV Telugu

Musk: ట్రంప్‌తో గొడవపై మస్క్ క్షమాపణ.. పోస్టులపై విచారం

Musk

Musk

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వెంటే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నడిచారు. అన్నీ తానై నడిపించాడు. ట్రంప్ ఎక్కడికెళ్లినా మస్క్ తప్పనిసరిగా ప్రచారంలో పాల్గొనేవారు. అలా పాలు.. నీళ్ల కలిసిపోయారు. అధికారం కూడా చేజిక్కింది. ఎప్పుడూ ట్రంప్ వెంటే కనిపించారు. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తూ ఉండేవారు. తాజాగా ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా మస్క్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వాటిన్నింటినీ వైట్‌హౌస్ ఖండిస్తూ వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య స్నేహం చెడిందని ప్రపంచ మీడియా కూసింది. అంతేకాకుండా మస్క్‌కు చెందిన కంపెనీలు మార్కెట్‌లో భారీ పతనాన్ని చూశాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్, జేడీవాన్స్, మస్క్‌ను చంపేస్తాం.. అల్‌ఖైదా హెచ్చరిక

తాజాగా ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు. ట్రంప్‌పై పెట్టిన పోస్టులపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిపై తాను పెట్టిన పోస్టులు చాలా దూరం వెళ్లాయని.. ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మస్క్ తాజాగా ట్వీట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: MP Balram Naik: కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలే.. ఎంపీ ఘాటు వ్యాఖ్యలు..!

ట్రంప్ పరిపాలన తీసుకొచ్చిన బిగ్ బ్యూటీఫుల్ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లుతో దేశం దివాలా తీయడం ఖాయమని.. అమెరికన్లు ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిని చేయాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వైట్‌హౌస్ అప్రమత్తం అయింది. మొత్తానికి ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ మస్క్ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Exit mobile version