El Nino: అత్యంత ప్రమాదకరంగా ‘ఎల్‌నినో’.. ప్రపంచానికి నాసా హెచ్చరిక
- పసిఫిక్ మహాసముద్రంలో భారీ వేడి అల
- అత్యంత ప్రమాదకరంగా ‘ఎల్‌నినో’
- ప్రపంచానికి నాసా హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్‌నినో ప్రభావం మరోసారి తీవ్రమైంది. పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 14,500 కిలోమీటర్ల పొడవున విస్తరించిన భారీ వేడి నీటి అల తూర్పు దిశగా కదులుతోందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేడి అల కారణంగా సముద్ర మట్టం కొన్ని ప్రాంతాల్లో సుమారు 15 సెంటీమీటర్లు ఎత్తుకు లేచినట్లు నాసా శాటిలైట్ నమోదు చేసింది. ఇదే ఎల్‌నినో ఏర్పడుతున్న ప్రధాన సంకేతమని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) జూన్ 11న అధికారికంగా ఎల్‌నినో ఏర్పడినట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి ఇది అత్యంత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం 63 శాతం ఉందని అంచనా వేసింది.
Also Read
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
ఎల్‌నినో అంటే ఏమిటి?
సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుంచి పడమర దిశగా వీచే వాణిజ్య గాలులు ఇండోనేషియా వైపు వేడి నీటిని నెట్టివేస్తాయి. అదే సమయంలో పెరూ తీరంలో సముద్ర గర్భం నుంచి చల్లటి, పోషకాలు అధికంగా ఉన్న నీరు పైకి వస్తుంది. దీనినే అప్‌వెల్లింగ్ అంటారు. అయితే కొన్నిసార్లు ఈ గాలులు బలహీనపడటం లేదా దిశ మారడంతో పడమరలో పేరుకుపోయిన వేడి నీరు తిరిగి తూర్పు వైపు కదులుతుంది. సముద్ర గర్భంలో ప్రయాణించే ఈ భారీ వేడి నీటి అలను కెల్విన్ వేవ్ అంటారు. ఈ వేడి నీరు తూర్పు పసిఫిక్‌కు చేరడంతో సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడతాయి.
నాసా శాటిలైట్ ఎలా గుర్తించింది?
2020లో ప్రయోగించిన నాసా-యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్త శాటిలైట్ ‘సెంటినెల్-6 మైకేల్ ఫ్రైలిచ్’ ప్రతి 10 రోజులకు ఒకసారి ప్రపంచ సముద్రాల ఉపరితల ఎత్తును అత్యంత కచ్చితత్వంతో కొలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో మైక్రోనేషియా సమీపంలో చిన్న కెల్విన్ వేవ్‌ను గుర్తించిన శాటిలైట్.. మార్చి నుంచి మరింత భారీ వేడి అల తూర్పు వైపు కదులుతున్నట్లు నమోదు చేసింది. మే మధ్య నాటికి పెరూ తీర ప్రాంతాల్లో సముద్ర మట్టం సాధారణ స్థాయికంటే 15 సెంటీమీటర్ల వరకు పెరిగినట్లు వెల్లడించింది.
సూపర్ ఎల్‌నినో వచ్చే అవకాశమా?
NOAA అంచనాల ప్రకారం.. ఈసారి పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగే అవకాశం 63 శాతం ఉంది. అలా జరిగితే 1997, 2015 సంవత్సరాల మాదిరిగా అత్యంత తీవ్ర ‘సూపర్ ఎల్‌నినో’ నమోదయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
భారత్‌పై ప్రభావం?
భారత్‌కు ఎల్‌నినో సాధారణంగా అనుకూలం కాదు. బలమైన ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడితే నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గి కరవు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే ఇండియన్ ఓషన్ డైపోల్ వంటి ఇతర వాతావరణ వ్యవస్థలు కొంత మేర ప్రభావాన్ని తగ్గించే అవకాశం కూడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న ఈ పరిణామాలను ప్రపంచ వాతావరణ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ ఏడాది శీతాకాలానికి ఎల్‌నినో గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!